Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Indian Air Force: 13,629 అడుగుల ఎత్తులో ‘IL-76MD’ ల్యాండింగ్.. వాయుసేన రికార్డు
By Eenadu2 min read at Eenadu
In brief
The Indian Air Force successfully landed a Russian-made IL-76MD heavy transport aircraft at the Nyoma Advanced Landing Ground in Ladakh at an altitude of 13,629 feet.
The IAF stated that this is the highest landing ever achieved by this aircraft worldwide, highlighting the exceptional capabilities of the crew.
The strategic base is located near the Line of Actual Control (LAC) and is part of broader infrastructure upgrades along the border.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: విమానయాన చరిత్రలో భారత వైమానిక దళం (Indian Air Force) అరుదైన రికార్డు సృష్టించింది. వాయుసేనకు చెందిన, రష్యన్ తయారీ భారీ రవాణా విమానం ‘ఐఎల్-76ఎండీ’ (IL-76MD).. లద్ధాఖ్లోని 13,629 అడుగుల ఎత్తయిన న్యోమా వైమానిక స్థావరంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపంచంలో ఈ విమానం సాధించిన అత్యంత ఎత్తయిన ల్యాండింగ్ ఇదేనని వాయుసేన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. విమాన అసాధారణ సామర్థ్యానికి ఇదొక నిదర్శనమని.. సిబ్బంది అత్యుత్తమ నైపుణ్యాలు, కచ్చితత్వం దీనికి తోడయ్యాయని తెలిపింది. ఈ ల్యాండింగ్‌ను దేశ వ్యూహాత్మక వాయు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే చారిత్రక ఘట్టంగా పేర్కొంది.
చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC)కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యోమా వ్యూహాత్మక వైమానిక స్థావరం.. గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లనూ ల్యాండ్ చేయొచ్చు. లద్దాఖ్‌లో ఈ తరహా నాలుగో వైమానిక స్థావరం ఇది. మిగతా మూడు లేహ్, కార్గిల్, థోయిస్లలో ఉన్నాయి. సైనిక అవసరాలకు అనుగుణంగా ఎల్ఎసీ వెంబడి అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ (ALG) సహా దాదాపు అన్ని ఎయిర్‌ఫీల్డ్‌లలో రక్షణశాఖ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్‌గా పేరుపొందిన దౌలత్ బేగ్ ఓల్డీ ఏఎల్జీ (16,700 అడుగుల ఎత్తు)లో కూడా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)