Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నల్లగొండ జిల్లాకు చెందిన అంబటి ప్రణీత్ తెలంగాణ రాష్ట్ర జట్టుకు 70వ ఎస్జీఎఫ్ఐ (SGFI) అండర్-19 జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ 2026–27లో కోచ్ కమ్ మేనేజర్‌గా నియమితులయ్యారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే ఈ పోటీల్లో ఆయన బాలుర, బాలికల జట్లకు శిక్షణ, సమన్వయం, మార్గదర్శకత్వం అందించనున్నారు.
జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించేలా కృషి చేస్తానని అంబటి ప్రణీత్ తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నల్లగొండ రూరల్, నవంబర్ 26 : జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఈ నెల 26 నుండి 30 వరకు జరిగే 70వ ఎస్జీఎఫ్ఐ (SGFI) అండర్-19 జాతీయ స్థాయి బాలుర, బాలికల తైక్వాండో ఛాంపియన్షిప్ 2026–27లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లకు నల్లగొండకు చెందిన అంబటి ప్రణీత్ కోచ్ కమ్ మేనేజర్‌గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలుర, బాలికల జట్లకు శిక్షణతో పాటు సమన్వయం, మార్గదర్శకత్వం అందించే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పతకాలు సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా అంబటి ప్రణీత్ తెలిపారు.
అంబటి ప్రణీత్ బ్లాక్ బెల్ట్ 2వ డాన్‌తో పాటు నేషనల్ రిఫరీగా, తైక్వాండో ఎన్ఎస్ఎన్ఐఎస్ కోచ్‌గా సేవలందిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తైక్వాండో క్రీడాభివృద్ధికి, యువ క్రీడాకారులకు శిక్షణ అందిస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు ఆయన చేస్తున్న కృషి విశేషం. తెలంగాణ రాష్ట్ర బాలుర, బాలికల జట్లకు జాతీయ స్థాయి పోటీల్లో కోచ్ కమ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించడం పట్ల పలువురు క్రీడా ప్రముఖులు, కోచ్‌లు, క్రీడాకారులు, శ్రేయోభిలాషులు అంబటి ప్రణీత్‌కు అభినందనలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ జట్లు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)