Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జర్నలిస్టుగా ఎవరు అర్హులు?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
సుప్రీంకోర్టు గురువారం జర్నలిస్టుల అర్హత, నిరసనలను కవర్ చేసే సమయంలో వారికి లభించే రక్షణల గురించి పరిశీలిస్తామని తెలిపింది.
అక్టోబర్ 10, 11 తేదీలలో ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న ఏడుగురు జర్నలిస్టులను నిర్బంధించడం, వారిపై దాడి చేయడం వంటి ఆరోపణలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలోని కమిటీకి సిఫార్సు చేసింది.
గుర్తింపు పొందిన జర్నలిస్టులకు లభించే రక్షణ స్వయం ప్రకటిత జర్నలిస్టులకు లభించకపోవచ్చని జస్టిస్ బాగ్చీ అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, , నవంబర్ 26: జర్నలిస్టుగా ఎవరు అర్హత పొందుతారు, నిరసనలను కవర్ చేసే సమయంలో స్వయం ప్రకటిత రిపోర్టర్ల కంటే గుర్తింపు పొందిన(అక్రెడిటెడ్) మీడియా వ్యక్తులకు ఎక్కువ రక్షణకు అర్హత ఉందా అనే అంశాలను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. దీంతో వృత్తిపరమైన జర్నలిస్టులు, సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టమైంది. పాత్రికేయ స్వేచ్ఛను, శాంతి భద్రతలు, చట్ట నిర్వహణతో సమతుల్యం చేయాలని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ ఏడాది అక్టోబర్ 10, 11 తేదీలలో ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న ఏడుగురు జర్నలిస్టులను నిర్బంధించడం, వారిపై దాడి చేయడం, ఆటంకాలు కలిగించడం వంటి ఆరోపణలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. జర్నలిస్టులు నిరసన ప్రదేశాల్లో ఉన్నారా, వారు అధిక బలప్రయోగానికి గురయ్యారా అనే అంశాలను నిర్ధారించేందుకు సంబంధిత సాక్ష్యాధారాలను ఐదుగురు సభ్యుల కమిటీ ముందు సమర్పించాలని పిటిషనర్లకు ధర్మాసనం సూచించింది. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు లభించే రక్షణ స్వయం ప్రకటిత జర్నలిస్టులకు లభించకపోవచ్చని జస్టిస్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)