Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరెంట్ కోతలపై అధికారుల ఆరా
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Following a social media post by BRS Working President KTR about power cuts in Telangana, state and district officials visited Ananthasagar village in Hanamkonda district to inspect the situation.
They spoke with farmers whose paddy crops were drying up and promised to take the issue of extending power supply hours to higher authorities.
Deputy Tahsildar Ravi and other officials prepared a report on the dried crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హనుమకొండ సబర్బన్, అక్టోబర్ 22: విద్యుత్తు కోతల కారణంగా నీళ్లందక పంటలు .. ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ వాటిని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న వెతలపై ఆయా శాఖల అధికారులు స్పందించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి ఎనిమిది ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోతుండగా నాలుగు ఆయిల్ ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న విషయమై గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ సంచికలో ‘ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
తెలంగాణలో వ్యవసాయ రంగ పరిస్థితి ఇలా ఉన్నదంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో వేలాది మంది దీన్ని షేర్ చేయడం సంచలనంగా మారింది. ఇది రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీంతో రాష్ట్రస్థాయి యంత్రాంగం మొత్తం జిల్లాస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది. మండల అధికారులు వేర్వేరుగా రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ముందుగా విద్యుత్తు శాఖ ఏఈ శిరీష్, సబ్‌ఇంజినీర్, నాయకులు విద్యుత్తు సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)