Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
A tractor carrying agricultural laborers overturned near Timmineni Palem in Khammam district, injuring 22 people, four of whom sustained severe injuries.
The injured were transported to a government hospital in Khammam via two ambulances.
The police have registered a case and initiated an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేని పాలెం సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది కూలీలకు గాయాలయ్యాయి. తిమ్మినేనిపాలెంకు చెందిన వ్యవసాయ కూలీలు పత్తి తీసేందుకు నాగులవంచ గ్రామానికి వచ్చారు. సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా తిమ్మినేనిపాలెం మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు అంబులెన్స్ వాహనాల్లో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)




