Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | అణచివేత సిగ్గుచేటు.. వేలం యోచన విరమించుకోవాలి : కేటీఆర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూకట్పల్లి ట్రక్పార్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకుల అరెస్టును కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిగా విమర్శించారు.
ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.
ఈ భూములు వేలాది మంది రవాణా కార్మికుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని తెలిపిన కేటీఆర్, అరెస్టు చేసిన నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి ట్రక్పార్ భూము ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయాలని చూడ టం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా అరెస్టు చేసిన అఖిలపక్ష నాయకులందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
కూకట్పల్లి ట్రక్ పార్ భూములు.. వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని తెలిపారు. నగర అవసరాలకు ఉపయోగపడే ఈ భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. ఈ నెల 27న ట్రక్ పార్ భూముల వేలాన్ని రద్దు చేయాలని, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేట్‌కు అప్పగించే యత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)