Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ట్రక్పార్ భూముల వేలం వద్దు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS మరియు వామపక్ష నేతలు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హెచ్ఎండీఏ ట్రక్పార్ భూముల ఈ-వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమీర్‌పేట జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు; ఈ క్రమంలో పోలీసులతో తోపులాట జరిగి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్వల్ప గాయాలయ్యాయి.
మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు, గతంలో రైతులు, దళితులు తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు.
కార్పొరేట్ సంస్థలకు ప్రజల ఆస్తిని అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ ఈ నెల 27న జరగనున్న వేలాన్ని అడ్డుకునేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు తేల్చిచెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని హుడా ట్రక్పార్ భూములను వేలం వేయొద్దని, ప్రజల ఆస్తిని కార్పొరేట్ సంస్థలకు బీఆర్ఎస్, వామపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 27న హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ట్రక్‌పార్క్ భూముల ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్, వామపక్షాల ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ మేరకు ఉదయం నుంచే అమీర్‌పేట, మైత్రీవనం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ కార్యాలయ దారుల్లో…
పోలీసు వలయాన్ని ఛేదించుకొని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ మేడ్చల్-మలాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు వేర్వేరు మార్గాల ద్వారా హెచ్ఎండీఏ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. ఈ సమయంలో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకొన్నది. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్తుండగా, తోపులాటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆయనతోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)