Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Last ritual offer packages: అంత్యక్రియలకు బతికుండగానే ఏర్పాట్లు చేసుకోవచ్చు.. ప్యాకేజీలు అందిస్తున్న స్టార్టప్ కంపెనీ
By Eenadu1 min read at Eenadu
In brief
దిల్లీకి చెందిన మోక్ష వాయేజ్ అనే అంకుర సంస్థ బతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
మృతదేహాన్ని తీసుకెళ్లడం, పురోహితులను ఏర్పాటు చేయడం, దహన సంస్కారాలకు అవసరమైన సామగ్రిని సమకూర్చడం వంటి సేవలను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది.
అస్థికలను నిమజ్జనం చేయడానికి, శ్రాద్ధకర్మలకు సహాయం చేయడానికి పడవ, ఘాట్ ఏర్పాట్లు కూడా చేస్తామని ఆ సంస్థ పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: మరణానంతరం జరగబోయే అంత్యక్రియలకు సంబంధించి బతికున్నప్పుడే ఏర్పాట్లు చేసుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఓ స్టార్టప్ కంపెనీ. దిల్లీకి (Delhi) చెందిన మోక్ష వాయేజ్(moksha voyage) అనే అంకుర సంస్థ అంత్యక్రియలకు సంబంధించి పలు ప్యాకేజీలను ప్రకటించింది. మృతదేహాన్ని దహన సంస్కారాలు జరిపే చోటుకు తీసుకెళ్లడం, ఆయా క్రతువులకు పురోహితులను ఏర్పాటు చేయడం, దహన సంస్కారాలకు అవసరమైన సామగ్రిని సమకూర్చడం, అంతిమ సంస్కారాలను నిర్వహించడం వంటి సేవలను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది.
ఈ ఆలోచనకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో ఆదరణ లభించినట్లు తమ వెబ్సైట్లో పేర్కొన్నారు. అస్థికలను సేకరించి నిమజ్జనం చేయడానికి, శ్రాద్ధకర్మలకు కూడా మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని, వాటి కోసం పడవ, ఘాట్ ఏర్పాట్లు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. దాదాపు రూ. 6 వేలు నుంచి రూ.1.5 లక్షల వరకు ప్యాకేజీల ధర ఉంటుందని పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)