Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A man in Nagpur, Maharashtra, was arrested for printing fake Rs 500 notes after failing to pay rent for over a year.
The landlord, Ramesh, broke into the rented room using a hammer and discovered a printing setup and Rs 37 lakh worth of counterfeit currency.
Police seized Rs 48 lakh in fake notes and are currently searching for the suspect, Pushpak Krishna Bhandarkar.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై: అద్దె ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి కిరాయి చెల్లించలేక ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ఇంట్లో రహస్యంగా నకిలీ రూ.500 నోట్లను అతడు ముద్రించాడు. ఇంటి యజమానితో గొడవ పడిన ఆ వ్యక్తి పారిపోయాడు. ఆ ఇంటి తాళం పగులగొట్టి లోపలకు వెళ్లి చూసిన యజయాని నకిలీ రూ.500 నోట్లు ప్రింట్ చేసి ఉండటం చూసి షాక్ అయ్యాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నాగ్‌పూర్‌లోని త్రిమూర్తి నగర్‌కు చెందిన పుష్పక్ కృష్ణ భండార్కర్ అలియాస్ బెండానె, ఏడాదిన్నర కిందట ఖర్బీ ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. అద్దె ఒప్పందం జనవరిలో ముగిసింది. అలాగే గత కొన్ని నెలలుగా ఇంటి యజమానికి అద్దె చెల్లించడం కూడా అతడు ఆపేశాడు.
కాగా, ఇంటిని ఖాళీ చేయాలని యజమాని రమేష్ డిమాండ్ చేయగా పుష్పక్ కత్తితో బెదిరించాడు. దీంతో ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చాలా కాలంగా పుష్పక్ అద్దె ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో యజమాని రమేష్ అక్టోబర్ 24న సుత్తితో డోర్ తాళం పగులగొట్టాడు. ఇంటి లోపలకు వెళ్లి చూడగా బకెట్లో కరెన్సీ నోట్ల కట్టలు, అక్కడక్కడ పడిఉన్న కాగితపు షీట్లు, ఒక ప్రింటర్ ఉండటం చూసి ఆయన షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)

