Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మియాపూర్ భూములపై కాంగ్రెస్ కన్ను
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
గత ప్రభుత్వం కాపాడిన మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ భూములను రూ.
40వేల కోట్ల ఆదాయ లక్ష్యంగా ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు హెచ్ఎండీఏ ద్వారా చర్యలు తీసుకుంటోందని వివరించింది. గత ప్రభుత్వం ఈ భూములను భవిష్యత్ తరాల కోసం పరిరక్షించగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని కేవలం సంక్షేమ పథకాలకు మళ్లించేందుకు సొమ్ము చేసుకుంటోందనే విమర్శలను కూడా ఇది నివేదించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ):గత ప్రభుత్వం ఎంతో కష్టపడి కాపాడిన 550 ఎకరాల భూమిని తెగనమ్మేందుకు కాంగ్రెస్ సరార్ అడుగులు వేస్తోంది. 100 ఎకరాలకుపైగా ఆక్రమణలు పోను మిగిలిన 386 ఎకరాల్లో 220 ప్లాట్లు చేసి విక్రయించేందుకు వేగం పెంచింది. మూడేండ్ల పాలనలో భూముల అమ్మకమే ప్రధాన ఆదాయ వనరుగా మారిందనే విమర్శల నేపథ్యంలో..ఉన్న భూములను సర్వం సిద్ధం చేస్తోంది. రూ. 40వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను మార్చింది.
హైదరాబాద్ నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలో ఉన్న మియాపూర్ ప్రభుత్వ భూములపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడింది. గత ప్రభుత్వం రెండు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, ప్రైవేట్ వ్యక్తుల చెర నుంచి కాపాడిన వందలాది ఎకరాల విలువైన భూమిని ఇప్పుడు వేలం పేరుతో తెగనమ్మేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ భూములను భవిష్యత్ తరాల కోసం, ప్రజా అవసరాల కోసం పరిరక్షించాలన్న గత ప్రభుత్వ ఆశయాన్ని పూర్తిగా విస్మరించిన ప్రస్తుత పాలకులు..మియాపూర్ భూములను కేవలం రూ. 40వేల కోట్ల ఆదాయంగా మలుచుకుంటున్నారనే విమర్శలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)