Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చేందుకు కృషి చేస్తాం: మంత్రి వివేక్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
State Minister Vivek Venkataswamy and MP Gaddam Vamsi Krishna attended a Mudiraj community event in Vemapally, Mancherial, where the minister announced efforts to upgrade the Mudiraj community from the BC-D to BC-A category.
Both leaders promised financial support for community buildings and skill development programs, while the MP pledged to conduct elections for thousands of community committees and provide insurance schemes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మంచిర్యాల జిల్లా, వేంపల్లి: ముదిరాజ్ సామాజిక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ముదిరాజ్‌లను ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో నిర్వహించిన ముదిరాజ్ సింహ గర్జన సభకు మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు.
సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగ రంగాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదన్నారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలనేది ఆ సామాజిక వర్గం దశాబ్దాలుగా చేస్తున్న ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. బీసీ-డీ కేటగిరీలో ఉండటం వల్ల ముదిరాజ్ యువతకు జరుగుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)