Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మురిగిపోయిన 1129 కోట్లు.. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కోత
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,129 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు గడువు ముగియడంతో లాప్స్ అయ్యాయని ఈ నివేదిక పేర్కొంది.
వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) సకాలంలో సమర్పించకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం వంటి కారణాలతో కేంద్రం పెండింగ్ నిధులను ఇక విడుదల చేయలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది.
దీంతో గ్రామ పంచాయతీలకు, మండల మరియు జిల్లా పరిషత్‌లకు రావాల్సిన నిధులు నిలిచిపోగా, అధికార యంత్రాంగం సోమరితనం మరియు పాలనాపరమైన వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శలు వ్యక్తమయ్యాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ సోమరితనంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,129 కోట్ల నిధులు మురిగిపోయాయి. పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కోసం కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు గడువు ముగియడంతో లాప్స్ అయ్యాయి. నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) సకాలంలో సమర్పించకపోవడం, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం, ఇతర సాంకేతిక కారణాలతో పెండింగ్ నిధులను ఇక విడుదల చేయలేమని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.729.41 కోట్లు, మండల, జిల్లా పరిషత్‌లకు రావాల్సిన మరో…
గత ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం పనిచేయడం ప్రారంభమైంది. దీంతో పాత ఆర్థిక సంఘం పరిధిలోని పెండింగ్ నిధులను విడుదల చేయడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పినట్టు సమాచారం. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీలకు మొత్తం రూ.3,023.15 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.2,293.75 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.729.41 కోట్ల నిధులు నిలిచిపోవడానికి వినియోగ ధ్రువీకరణ పత్రాల సమర్పణలో లోపాలే ప్రధాన కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు రావాల్సిన రూ.400 కోట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2024- 25, 2025- 26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధుల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)