Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ధైర్యం కోల్పోకండి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన రైతు సిరిపురం తిరుపతితో ఫోన్లో మాట్లాడి సాగు నీరందక ఎండిపోయిన పంటలకు నిప్పులు పెట్టుకోకూడదని భరోసా నింపారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, శ్రేణులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పంటలను పరిశీలించి మాట్లాడారు.
గూడెం లిఫ్ట్, కడెం ప్రాజెక్ట్ ద్వారా నీరు విడుదల చేయకుండా ప్రభుత్వం రైతులను గోసపెడుతోందని విజిత్‌రావు మండిపడ్డారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దండేపల్లి, నవంబర్ 19 : ‘ఇది మన దురదృష్టం. ఈ ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ధైర్యం కోల్పోకండి.. ఇలా పంటలకు నిప్పులు పెట్టుకోకండి..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన రైతు సిరిపురం తిరుపతితో ఫోన్లో మాట్లాడి భరోసా నింపారు. ఇటీవల సాగు నీరందక కడుపుమండి ఎండిన వరికి పెట్రోల్ పోసి నిప్పంటించిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, శ్రేణులతో కలిసి గురువారం వెళ్లారు. రైతులు మల్లికార్జున్, సిరిపురం తిరుపతి, తొట్ల సత్తన్న, మామిడి రాజన్న పంటలను పరిశీలించి వారితో మాట్లాడారు.…
ఈ సందర్భంగా విజిత్‌రావు మాట్లాడుతూ.. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో సాగు నీరందక అనేక ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. గూడెం లిఫ్ట్, కడెం ప్రాజెక్ట్ ద్వారా రైతాంగానికి నీరివ్వాల్సిన ప్రభుత్వం, నీటిని విడుదల చేయకుండా రైతులను గోసపెడుతున్నదని మండిపడ్డారు. గూడెం లిఫ్ట్ నుంచి మోటర్లు ఆన్ చేసి, కాళేశ్వరం నుంచి ఎల్లంపెల్లి ప్రాజెక్టు నింపితే నియోజకవర్గంలో పంటలు ఎండిపోయేవి కావని చెప్పారు. ఇప్పటికైనా చివరి తడి అందించి, రైతులు పూర్తిగా నష్టపోకుండా చూడాలని కోరారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)