Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Online betting | ఆన్లైన్ బెట్టింగ్.. అప్పుల ఊబిలోకి.. చివరకు చోరీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బోయినపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలైన ముష్ణం వెంకటేష్ (29) అనే యువకుడు తన అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసును చోరీ చేశాడు.
వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయగా, రూరల్ సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Online betting | బోయినపల్లి, నవంబర్ 27: ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు, అప్పులు తీర్చేందుకు సొంత అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసును అపహరించాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి పది గ్రాముల బంగారు గొలుసు, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. కోనరావుపేట మండలం పల్లె నిజామాబాద్‌కు చెందిన ముష్ణం వెంకటేష్ (29) హైదరాబాద్‌లో ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి తొలుత కొంత డబ్బు గెలిచినా, ఆ తర్వాత భారీగా…
కోదురుపాక గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తన అమ్మమ్మ బొంగొని రాజవ్వ మెడలో బంగారు గొలుసు ఉండటాన్ని గమనించి ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ నెల 18న పల్సర్ బైక్‌పై కోదురుపాకకు చేరుకొని, మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. గుర్తుపట్టకుండా లైట్ ఆర్పి, రాజవ్వ నోటికి తువ్వాలు అడ్డుపెట్టి బెదిరించి మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు బోయినపల్లి ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కోదురుపాక ఎక్స్‌రోడ్డు వద్ద…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)