Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పార్లమెంట్ సమావేశాలపై జాప్యమెందుకు?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
విపక్షాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసి 100 రోజులకు పైగా గడిచినా ప్రభుత్వం శీతాకాల సమావేశాల గురించి ప్రకటించలేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడం వల్లే ప్రభుత్వం ఈ సమావేశాలను నిర్వహించడంలో జాప్యం చేస్తుందని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసి 100 రోజులు గడిచినా మోదీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల ఊసెత్తకపోవడాన్ని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు శీతాకాల సమావేశాలు ఉంటాయా? ఉండవా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌తో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఘర్షణ కొనసాగుతున్న వేళ, పార్లమెంట్ శీతాకాల సమావేశాన్ని నిర్వహించడంలో జాప్యంపై విపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చరిత్రలో నాలుగుసార్లే జరగలేదు.
ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, సమావేశాలను అధికారికంగా ముగించినట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. అప్పటి నుంచి 100 రోజులకు పైగా గడిచాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వచ్చే సమావేశాలను 2027 ఫిబ్రవరి 12లోపు ప్రభుత్వం నిర్వహించాలి. సమావేశాలను అధికారికంగా ముగించకపోవడంతో, డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయడానికి స్వల్ప వ్యవధి నోటీసుతో ప్రత్యేక సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉన్నదని ఇటీవల కొన్ని వార్తాసంస్థలు తెలిపాయి. అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. శీతాకాల సమావేశాలపై ప్రభుత్వ వైఖరి కోసం ఎదురుచూస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)