Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పదేండ్లుగా కాగితాలపైనే ట్రిపుల్ ఆర్..కేంద్ర కేబినెట్ గడప దాటని ఫైల్
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
The central government has allegedly neglected the Regional Ring Road (RRR) northern section project in Telangana for over a decade, despite the state government completing significant groundwork including land acquisition and financial contributions.
State officials and politicians claim that while neighboring states receive faster clearances, Telangana faces discriminatory delays in central cabinet approval.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం ప్రాజెక్టుపై కేంద్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పదేండ్ల కింద, అంటే 2016 నవంబర్లోనే ఈ రహదారికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దశాబ్దం గడిచినా ఆ ఫైలు ఇంకా కేంద్ర కేబినెట్ గడప దాటలేదు. రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రులు, మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా కేంద్రంలో చలనం రావడం లేదు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల రవాణా ముఖచిత్రాన్ని మార్చే 161.5 కిలోమీటర్ల ఈ ఉత్తర భాగం ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం కాగితాలకే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
పక్క రాష్ట్రాల్లో వందల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలకు నెలల్లోనే అనుమతులు ఇస్తున్న కేంద్రం, రాష్ట్రానికి అత్యంత కీలకమైన ట్రిపుల్ ఆర్‌పై మాత్రం ఏండ్ల తరబడి చూపిస్తోందనే విమర్శలున్నాయి. ఈ ఫైల్‌పై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో, సూత్రప్రాయ ఆమోదం వచ్చిన సంవత్సరం చూసి సీఎంతో పాటు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. భూసేకరణ వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర సర్కార్ వెనకాడలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హడ్కో నుంచి ప్రత్యేకంగా అప్పు తెచ్చి మరీ వందల కోట్ల వాటాను ఎన్హెచ్ఏఐకి జమ చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)