Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Per Capita Income | తలసరి ఆదాయంలో తెలంగాణ దూకుడు.. 8వ స్థానం నుంచి రెండో స్థానానికి!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో ఎనిమిదో స్థానం నుంచి 2023-24 నాటికి రెండో స్థానానికి ఎగబాకిందని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) నివేదిక వెల్లడించింది.
ఈ కాలంలో రాష్ట్ర జీఎస్డీపీ 219% పెరిగిందని, జాతీయ తలసరి ఆదాయం 48% మరియు ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 63% పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్, కాళేశ్వరం ప్రాజెక్టులు వంటి నిర్ణయాలే ఈ ఆర్థిక ప్రగతికి దోహదపడ్డాయని నివేదిక స్పష్టం చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Per Capita Income | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలు పరిచింది. దీంతో తొలి పదేండ్లలో రాష్ట్రం తలసరి ఆదాయంలో గణనీయ పురోగతి సాధించింది. 2014-15 నాటికి సాధారణ క్యాటగిరీ రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఎనిమిదో స్థానంలో ఉన్న తెలంగాణ.. 2023-24 నాటికి రెండో స్థానానికి ఎగబాకింది. అప్పటికి తెలంగాణ కంటే గోవా రాష్ట్రం మాత్రమే ముందున్నది. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విస్తరణకు, ప్రజల తలసరి ఆదాయ పెరుగుదలకు దోహదపడ్డాయని తాజాగా సెంటర్ ఫర్…
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక ఆర్థికంగా తెలంగాణ గణనీయ వృద్ధిని నమోదు చేసిదని, 2014-25 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 219% పెరిగి రూ.5,05,484 కోట్ల నుంచి రూ.16,09,902 కోట్లకు చేరినట్టు ‘సెస్’ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో దేశ జీడీపీ 165%, ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 206% వృద్ధి చెందినట్టు పేర్కొన్నది. 2019-21 మధ్య కొవిడ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ కోలుకునే పరిస్థితి కనిపించినప్పటికీ కొవిడ్‌కు ముందు నమోదైన వృద్ధి స్థాయిలను అందుకోలేకపోయాయని నివేదిక విశ్లేషించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)