Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతుబంధు వరం.. తగ్గిన రుణభారం.. కేసీఆర్ పథకం.. తెచ్చిన ఫలితం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
సెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం వల్ల తెలంగాణ రైతులపై రుణభారం గణనీయంగా తగ్గింది మరియు ప్రైవేట్ రుణాలపై ఆధారపడటం 14 నుంచి 20 శాతం మేర తగ్గింది.
ఈ పథకం అమలు తర్వాత సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది.
అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతుభరోసాగా మార్చి ఎకరానికి రూ. 12 వేలకు పరిమితం చేసిందని నివేదిక పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒక ఆలోచన అన్నదాతల ఆత్మహత్యల్ని ఆపింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి రైతుల్ని కాపాడింది. పంట సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందించి, సాగుకు భరోసాను ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకం.. ఎవుసం ప్రధానంగా బతికే తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చింది. కర్షకులపై రుణభారం తగ్గించింది. ఆర్థిక తోడ్పాటునందించింది. సాగు పథకాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన ‘రైతుబంధు’ పథకం.. రాష్ట్ర రైతులను అప్పుల నుంచి విముక్తులను చేయడమే కాదు.. వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకునే అవసరాన్ని కూడా తగ్గించింది. వారికి ఈ పథకం ఆర్థిక అండగా నిలిచి, పంటల సాగు, ఉత్పత్తి పెంపునకు ఎంతో సాయపడింది. పలు రంగాల అభివృద్ధిపై అధ్యయనం చేసే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)