Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఫారం-6లో మార్పులపై విచారణలో వాదనలు.. నవంబర్ 17కు విచారణ వాయిదా - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
The Supreme Court issued notices to the Election Commission of India regarding petitions challenging CEC Gyanesh Kumar's performance.
The court adjourned the hearing to November 17, 2023, and gave the petitioners two weeks to respond to the Election Commission's affidavit.
The Election Commission stated that all final decisions related to the special comprehensive voter list revision were taken unanimously.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఈ పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చి, వి. మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది.
సర్ నిర్ణయాలు ఏకగ్రీవమని ఈసీ వివరణఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత, ఓటర్ల జాబితా నిర్వహణకు ఉపయోగించే ఈఆర్ఓనెట్ వ్యవస్థలో అధికారాల కేంద్రీకరణ, ఓటర్ల పేర్ల నమోదు, జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీసింది.అయితే, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన తుది నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది.
This is Visalaandhra’s reporting. Read it where it was published.
Read the full story at Visalaandhra (opens in a new tab)
