Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పిడుగు పడితే సొరంగమైంది.. బండ రాయే ఆలయమైంది
By Eenadu1 min read at Eenadu
In brief
హైదరాబాద్ శివారు సూరారంలో ఉన్న ఒక ఆలయం ఒకప్పుడు పెద్ద బండరాయి అని చరిత్ర చెబుతోంది.
ఆ బండరాయిపై పిడుగు పడటంతో రెండుగా చీలిపోయి సొరంగం ఏర్పడిందని స్థానికులు అంగీకరిస్తున్నారు.
కాలక్రమేణా స్థానికులు ఆ సొరంగం ముఖ ద్వారానికి ఏనుగు తల ఆకారాన్ని తీర్చిదిద్దారు, భక్తులు దీనిని కైలాసగిరిగా పిలుచుకుంటూ నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ శివారు సూరారంలో ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు పెద్ద బండరాయి అంటే నమ్మగలమా! ఆలయ చరిత్ర ప్రకారం చూస్తే నిజమేనని అంగీకరించకతప్పదు. పెద్ద బండరాయిపై పిడుగు పడినప్పుడు రెండుగా చీలిపోయి సొరంగం ఏర్పడగా... అనంతర కాలంలో స్థానికులు సొరంగం ముఖ ద్వారాన్ని ఏనుగు తల ఆకారంలో తీర్చిదిద్దారు. రాయి పైభాగాన ఒకవైపు శివుడు, మరోవైపు ఆంజనేయస్వామి కన్పించేలా ఓ విగ్రహాన్ని, మరోవైపు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సొరంగం నుంచి వెళ్తే కాళికామాత దర్శనమిస్తుంది. భక్తులు ఈ ప్రదేశాన్ని కైలాసగిరిగా పిలుచుకుంటూ..నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)