Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PM Modi: ‘ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు వెనుకడుగు’.. ప్రతిపక్షాలపై మోదీ విమర్శలు
By Eenadu2 min read at Eenadu
In brief
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ‘స్నేహ మిలన్’ కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వ విధానాల వల్ల 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.
ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు కొందరు ఇంకా వెనుకాడుతున్నారని ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు.
ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావిస్తూ, పేదల కోసం ప్రారంభించిన పథకాలు చిట్టచివరి వ్యక్తికి చేరేశామని, ఇది సామాజిక న్యాయానికి నిదర్శనమని వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని.. అయితే, ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు కొందరు ఇంకా సంకోచిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ విధానాలు, కృషికి ఈ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. గుజరాత్లోని మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ‘స్నేహ మిలన్’ కార్యక్రమంలో భాగంగా భాజపా కార్యకర్తలనుద్దేశించి మోదీ (Narendra Modi) వర్చువల్గా ప్రసంగించారు. కార్యకర్తల కృషి వల్లే తాను సొంత రాష్ట్రానికి, దేశానికి సేవ చేయగలిగే స్థాయికి చేరుకున్నానని కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ మనల్ని పేదరికంలోకి నెట్టింది. ఆ తర్వాత మొదటిసారి 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. నా జీవితంలో ఇంతకంటే గొప్ప సంతృప్తి, విజయం మరొకటి ఉండదు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన, జీవితాలను అంకితం చేసినవారి ఆత్మలు ఎక్కడ ఉన్నా.. ప్రపంచ బ్యాంకు నివేదికను చూసి నేడు ఎంతో సంతోషిస్తుంటాయి. ‘ఎట్టకేలకు నా దేశం నుంచి పేదరికం తొలగిపోతోంది’ అని అవి భావిస్తుంటాయి. అయితే, ఈ విజయాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు కొందరు ఇంకా వెనుకాడుతున్నారు. భాజపా హయాంలో ఇదంతా జరిగింది కాబట్టి వారికి నచ్చడం లేదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)