Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు చట్టాలపై అవగాహన కల్పించారు.
ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారని, అనంతరం కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ రెవెన్యూ, కుటుంబ చట్టాలపై వివరించారని నివేదించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
కోదాడ, నవంబర్ 18 : జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు న్యాయ సేవలు, వివిధ చట్టాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి కె.సురేశ్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ క్రిమినల్, సివిల్ అలాగే రెవెన్యూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు సైతం తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించవచ్చని, వారికి న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాలు, కుటుంబ చట్టాలు, భూ సమస్యల పరిష్కార మార్గాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, తాసీల్దార్ సంతోష్ కుమార్, న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, ఉయ్యాల నరసయ్య, కోడూరు వెంకటేశ్వరరావు, మంద వెంకటేశ్వర్లు, సామా నవీన్ కుమార్, దుగ్గి వెంకటేష్ రెవెన్యూ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)