Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ దండా రాజి రెడ్డికి అగ్రోమెటియరాలజీ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా అసోసియేషన్ ఆఫ్ అగ్రోమెటియరాలజిస్ట్స్ గౌరవ ఫెలోషిప్ ప్రదానం చేశారు.
అసోసియేషన్ ఆఫ్ అగ్రోమెటియరాలజిస్ట్స్ ఈ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌ను 2026 నవంబర్ 26న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం జీకేవీకే ప్రాంగణంలో ప్రదానం చేసింది.
ప్రొఫెసర్ రాజి రెడ్డి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, పంటల ప్రణాళిక, విపరీత వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే నిర్ణయ సహాయక వ్యవస్థల అభివృద్ధిలో విశేష కృషి చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Professor D Rajireddy | శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ దండా రాజి రెడ్డికి అగ్రోమెటియరాలజీ (వ్యవసాయ వాతావరణ శాస్త్రం) రంగంలో పరిశోధన, బోధన, విస్తరణ రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అసోసియేషన్ ఆఫ్ అగ్రోమెటియరాలజిస్ట్స్ గౌరవ ఫెలోషిప్ (FAAM) ప్రదానం చేశారు. 2026 నవంబర్ 26న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం , జీకేవీకే ప్రాంగణంలో గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేషన్ ఆఫ్ అగ్రోమెటియరాలజిస్ట్స్ ఈ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌ను ప్రదానం చేసింది.
ప్రొఫెసర్ రాజి రెడ్డి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, పంటల ప్రణాళిక, చీడపీడలు, తెగుళ్ల ముందస్తు అంచనాలు, కరువు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే నిర్ణయ సహాయక వ్యవస్థల అభివృద్ధిలో విశేష కృషి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్లాండ్, ఐఆర్ఐ-కొలంబియా యూనివర్సిటీ, CCAFS-CGIAR, ఆస్ట్రేలియాకు చెందిన CSIRO-ACIAR వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయన పరిశోధనలకు గుర్తింపు లభించింది. వాతావరణ ప్రమాదాల అంచనా, వాతావరణ మార్పుల ప్రభావాలు, పంటల అనుకరణ నమూనాలు, కరువు పర్యవేక్షణ, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సాంకేతికతలను వ్యవసాయ ప్రణాళికలో వినియోగించడం వంటి అంశాల్లో నిపుణులు. జాతీయ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)