Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sitarama Project | సీతారామ కాలువ పనులను అడ్డుకున్న కమలాపురం రైతులు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కమలాపురం రైతులు సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
2021లో నిర్ణయించిన పరిహారం కాకుండా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
పంటలు చేతికొచ్చే వరకు పనులు నిలిపివేయాలని పట్టుబట్టగా, అధికారులు మాత్రం ఎలాంటి కోర్టు ఆదేశాలు అందలేదని, ఖాళీ భూముల్లో పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sitarama Project | కారేపల్లి, నవంబర్ 22: సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కమలాపురం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. భూసేకరణకు సంబంధించి 2021లో నిర్ణయించిన పరిహారం కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న వరి, పత్తి పంటలు చేతికొచ్చే వరకు కాలువ పనులు చేపట్టవద్దని పట్టుబట్టారు.
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం కమలాపురానికి చెందిన సుమారు 45 మంది రైతుల 54 ఎకరాల భూమిని 2021లో అధికారులు సేకరించి పరిహారం అవార్డు ప్రకటించారు. ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారం నిర్ణయించినప్పటికీ, చాలాకాలం డబ్బులు అందకపోవడంతో రైతులు ఆ భూముల్లో సాగు కొనసాగించారు. ఈ ఏడాది ఆగస్టు 25న పరిహారం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు. అయితే, అప్పటికే భూముల్లో వరి, పత్తి పంటలు సాగు చేయగా ప్రస్తుతం అవి దిగుబడికి వచ్చాయి. ఈ సమయంలో కాలువ నిర్మాణానికి కాంట్రాక్టర్ జేసీబీ యంత్రాలను తీసుకురావడంతో రైతులు అడ్డుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)