Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Snapdeal: మైక్రోసాఫ్ట్ తిరస్కరిస్తే.. ‘స్నాప్‌డీల్’ పుట్టుకొచ్చింది
By Eenadu2 min read at Eenadu
In brief
కునాల్ బహల్ మైక్రోసాఫ్ట్‌లో హెచ్1బీ వీసా తిరస్కరణకు గురైన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి తన స్నేహితుడు రోహిత్ బన్సల్‌తో కలిసి స్నాప్‌డీల్‌ను స్థాపించాడు.
2007లో కూపన్-బుక్ పేరిట ప్రారంభమైన ఈ సంస్థ క్రమంగా స్నాప్డీల్గా అభివృద్ధి చెంది, ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ వంటి సంస్థలతో పోటీపడుతోంది.
మెట్రో నగరాలకు వెలుపల ఉన్న చిన్న పట్టణాలు మరియు మధ్యతరగతి వినియోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: హెచ్1బీ వీసా సాకు చూపి ఓ ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసివేసినా వెనకడుగు వేయలేదు. కష్టపడి పని చేసి.. తన స్నేహితుడితో కలిసి ఓ సంస్థనే స్థాపించాడు. కొన్నేళ్లలోనే ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఆయనే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘స్నాప్‌డీల్’ సహ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త కునాల్ బహల్. ఓ అంతర్జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో తన ప్రయాణానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
యూఎస్‌లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన కునాల్ కొంత కాలంపాటు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. అనంతరం అందులోనే ఉద్యోగంలో చేరారు. అనంతరం హెచ్1బీ వీసా (H 1B)కు దరఖాస్తు చేయగా అది తిరస్కరణకు గురైంది. దీంతో అమెరికా వదిలి.. ఇండియాలోని తమ కంపెనీలో పనిచేయాలని, ఏడాది తర్వాత తిరిగి వీసా కోసం అప్లై చేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. ఆ తిరస్కారమే కునాల్ కెరీర్‌ను మలుపుతిప్పింది. మెక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు వచ్చిన అతడు.. తన తెలివిని, అనుభవాన్ని ఉపయోగించి ఈ-కామర్స్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)