Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Vodithala Satish Kumar | హుస్నాబాద్ నుండి దీక్షా దివస్ సభకు పెద్ద ఎత్తున తరలింపు.. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ఈ నెల 29న అలుగునూర్ లో జరగనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిస్తామని తెలిపారు.
ఈ సభ కోసం 40 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు నష్టపోతున్నారని, ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన నాయకత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సతీష్ కుమార్ అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Vodithala Satish Kumar | చిగురుమామిడి, నవంబర్ 25 : ఈ నెల 29న అలుగునూర్ లో జరగనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలిస్తామని హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ తెలిపారు. ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికీ తెలియజేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభ కోసం 40 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుండి, ప్రతీ మండలం నుండి కార్యకర్తలు, తెలంగాణ వాదులు 20 వేలకు పైగా పెద్ద సంఖ్యలో…
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు నష్టపోతున్నారని, అన్ని ఉన్నా అన్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఉన్న నాయకత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సతీష్ కుమార్ అన్నారు. ప్రాజెక్టులను నిర్మించి, నీళ్లిచ్చిన ఘనత, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన చరిత్ర గురించి ఈ సభలో ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)