Sports · 16 Nov
‘రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో నల్లగొండకు ప్రథమ స్థానం తీసుకురావాలి’
AI summaryనల్లగొండ రూరల్, నవంబర్ 16 : రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి నల్లగొండ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా సీనియర్ గర్ల్స్ హ్యాండ్బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ ఎంపిక పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు జిల్లాల నుంచి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య తెలిపారు.
1 outlet