Visalaandhra ·
క్రీడాలోకంలో విషాదం.. మూడుసార్లు పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ బలవన్మరణం - Visalaandhra
భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించి దేశ కీర్తిని పెంచిన స్టార్ అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం విషం తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో భారత క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు.ఈ విషయాన్ని భారత పారా-అథ్లెటిక్స్ జట్టు హెడ్ కోచ్ ఎస్. సత్యనారాయణ ధ్రువీకరించారు. నీరజ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఇలా జరగడం బాధాకరంఁ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఆసియా పారా గేమ్స్‌కు…
కోచ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆయన ఆత్మహత్యకు కారణం ఇదేనని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ, ఒక క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా స్వీకరించగలగాలి. ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం విచారకరం అని వ్యాఖ్యానించారు.భారత్‌కు చెందిన ప్రతిభావంతులైన పారా అథ్లెట్లలో నీరజ్ యాదవ్ ఒకరు. 2018 జకార్తా ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. 2023లో హాంగ్జౌలో జరిగిన క్రీడల్లో జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. ఏడేళ్ల వయసులో పోస్ట్-పోలియో రెసిడ్యువల్ ప్యారాలిసిస్కు గురైన నీరజ్, మొదట వీల్‌చైర్ టెన్నిస్‌లో రాణించి, ఆ తర్వాత పారా-అథ్లెటిక్స్‌లోకి…