We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Minister Seethakka directed officials to take measures for rainwater to seep underground, complete percolation pit constructions, and raise awareness about El Niño and water conservation at the village level.
హైదరాబాద్: వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్ల నిర్మాణాలు రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఎల్నినో, నీటి పొదుపుపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లతో సీతక్క శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో నేపథ్యంలో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాలకు రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని, ఇతర జిల్లాల్లో తక్షణ తాగునీటి అవసరాలకు రూ. కోటి చొప్పున నిధులు వెచ్చించామని చెప్పారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దటి ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు. చేతిపంపులు, బావులు, స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
The article reports that a severe drought is approaching Telangana due to alleged mismanagement by the Congress government, contrasting it with the previous BRS administration's water management.
శ్రీకాకుళం జిల్లాలో హైవేపై డ్రైవర్ల ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్నాయి.. బహుదా నది వరద ఉధృతి కారణంగా హౌరా-చెన్నై హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది ఏడుదుర్కొంటున్నారు. కనీసం 48 గంటలుగా తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు. మరో పక్క టోల్ గేట్ దగ్గర వాహనదారుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది.
వరద నీరు హైవేపైకి చేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు రోజులుగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Mission bhagiratha water | చిగురుమామిడి, అక్టోబర్ 28: కాంగ్రెస్ సర్కార్ పాలనలో అధికారులు నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నిర్వాహణ పనులను గాలికొదిలేస్తున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ బస్టాండ్ చౌరస్తా నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో గత నాలుగు రోజులుగా తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైప్లైన్ పగిలిపోవడంతో గంగిరెద్దుల కాలనీ, బీసీ కాలనీకి వెళ్లాల్సిన మిషన్ భగీరథ తాగునీరు తక్కువ సరఫరా అవుతోందని సమీప మహిళలు తెలిపారు. ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు విలువైన తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తున్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మాగనూరు : సాగునీటి కాలువకు పడిన సంఘం బండ కాల్వ గండిని (Plugging) పూడ్చి నీటి వృథాను అరికట్టాల్సిన ఇరిగేషన్ అధికారుల (Irrigation Officials ) చర్యలు కేవలం ఫొటోలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువకు గండి పడటంతో విలువైన సాగునీరు వాగులోకి వృథాగా ప్రవహిస్తున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఈ సమస్యపై పత్రికలో కథనం ప్రచురితం కావడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించారు. గండిని పూడ్చేందుకు జేసీబీ యంత్రాన్ని పంపించి పనులు చేపట్టినట్లు కనిపించేలా ఫొటోలు తీసినప్పటికీ, వాస్తవంగా గండి పూడ్చే పనులు పూర్తి చేయకుండానే యంత్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. ఇరిగేషన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ యువరాజ్ గౌడ్ కాలువ గండిని పూడ్చామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం గండి అలాగే ఉందని రైతులు ఆరోపించారు. ఒకవైపు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీరు వృథాగా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.