We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
In Medak district, 65-year-old Tirupati Kishan died after being hit by an unidentified vehicle while crossing the road to sell his harvested paddy to private traders.
మెదక్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ధాన్యం విక్రయించుకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్‌కు చెందిన తిరుపతి కిషన్ (65) ఈ ప్రమాదంలో మృతిచెందారు. గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల ద్వారా ధాన్యం అమ్ముకునేందుకు సిద్ధమైన ఆయన.. చివరకు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు.
తిరుపతి కిషన్ తన పొలంలో వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నారు. అయితే గ్రామ పరిసరాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్ 3న రాత్రి 10.45 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఔరంగాబాద్ గేట్ వద్ద పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఆయనను ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన కిషన్‌ను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
A 45-year-old tenant farmer, Malavath Shankar, died accidentally after falling under a harvester while harvesting paddy in Medak district. The Welluthy police registered a case and sent the body for a post-mortem. Shankar is survived by his wife, three daughters, and one son.
Karnataka Minister Satish Jarkiholi stated that sugar factories in the state will only reopen if sugarcane farmers agree, noting that factory owners are unwilling to take risks in the current climate.
రాజాపేట, నవంబర్ 3: ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టిన రైతన్న.. నేడు తన కుటుంబాన్ని సాకడానికి రోజువారీ కూలీగా మారాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్లముందే ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికిన అన్నదాతకు ఇప్పుడు కూలి పనులే దికయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువు గ్రామానికి చెందిన నీల లక్ష్మీనారాయణకు ఐదెకరాల భూమి ఉన్నది. ఒక బోరు ఆధారంగా మూడు ఎకరాల్లో వరి సాగుచేశాడు.
తీరా పంట పొట్ట దశకు చేరే సమయంలో విద్యుత్తు కోతలు, వర్షాభావ పరిస్థితులతో నీరందక పంట మొత్తం ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి బూడిద కావడంతో దికుతోచని స్థితిలో పడిపోయాడు. వ్యవసాయానికి తోడుగా ఉన్న నాలుగు పశువులకు నీరు, గ్రాసం అందించలేక వాటిని సైతం అమ్ముకున్నాడు. ఓ వైపు పంట నష్టం.. మరోవైపు కుటుంబ పోషణ భారంగా కావడంతో చేసేదేమీ లేక రోజువారీ కూలీగా మారాడు. ఒకప్పుడు తన పొలంలో వ్యవసాయం చేసిన చేతులే.. నేడు కూలి పనులు చేస్తున్నాయి. వడ్లు పండించే రైతన్నే పట్టెడన్నం కోసం కష్టపడాల్సిన దుస్థితి రావడం పలువురిని కలచివేస్తున్నది.
వెల్దుర్తి: ఓ కౌలు రైతు ప్రమాదవశాత్తు హార్వెస్టర్ కింద పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మహమ్మద్ నగర్ తండా పరిధిలోగల పెద్దమ్మ గడ్డ తండాలో కౌలుకు తీసుకున్న పొలంలో హార్వెస్టర్‌తో వరి పంట నూర్పిడి చేయిస్తుండగా ప్రమాదవశాత్తు రైతు మలావత్ శంకర్(45) హార్వెస్టర్ వెనుక భాగంలో పడి చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య భుజాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్దుర్తి ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై చెప్పారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Open canal | మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని దంతంపల్లి శివారులో రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ కెనాల్ నిర్మాణ పనులను బాధిత రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ఎలా చేపడతారని అధికారులను నిలదీశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు పనుల ప్రదేశానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఊట్కూరు పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే గ్రామానికి ముంపు ప్రమాదం పొంచి ఉందని, ఈ నేపథ్యంలో ఊట్కూరు గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని రైతులు…
భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంతో పాటు పొలాల్లోని చెట్లు, సాగునీటి పైపులైన్లు, బోరుబావులు, కంచెలకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో దాదాపు రెండు గంటలకు పైగా పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
మిడ్జిల్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పాడి రంగాన్ని ఎంచుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని పశువైద్య అధికారి శివరాజ్ అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం ఇబ్బందికరంగా మారుతుందన్నారు. గ్రామాల్లో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, బోయిన్పల్లి, వాడియాల గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బోడ గోపాల్, శశికళ, చంద్రయ్య గౌడ్, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
– రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన – 350 మంది రైతులకు మొక్కజొన్న విత్తనాల పంపిణీ
రుద్రంపూర్, నవంబర్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 350 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడె గణేష్ చౌహాన్ మాట్లాడుతూ.. రైతులు దేశానికి వెన్నెముక వంటివారని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సాంకేతిక సేవలు, సలహాలు…
సంగారెడ్డి టౌన్: ఎల్‌నినో కారణంగా కరవు బారిన పడిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్గొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజు, నాయకులు భూషణం, మాణిక్ రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
– సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చండూరు, నవంబర్ 02 : ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు ఏర్పడిన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరువు యాత్రలో భాగంగా సోమవారం చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను సిపిఐ బృందం పరిశీలించింది. గ్రామంలో సుంకరి లింగయ్య శాంభవి, సుంకరి రాములు పంట పొలంను పరిశీలించిన అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరువును జాతీయ విపత్తుగా గుర్తించి ప్రజలను, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చండూరు మండలంలో 28 వేల ఎకరాల పైచిలుకు పత్తి, 2 వేల 500 ఎకరాలలో వరి పంట సాగు చేయడం…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.