Andhra Jyothy ·
తెలంగాణలో వ్యవసాయ సంస్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు
Home » Telangana » Hyderabad » telangana sasci funds agriculture reforms
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:45 PM
Trending search
25 analysed of 25 matched articles · 5 outlets · checked 18 Nov 2026 23:17 IST
Data source: Google Trends — search attention, not opinion
We do not carry live scores. The outlets below publish their own match coverage; each "Read the full story" link opens it.
n = 25 analysed articles from 5 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
తెలంగాణలో వ్యవసాయ సంస్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, SASCI పథకం కింద కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఈ వార్త నివేదించింది.
Visalaandhra
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి: కేటీఆర్ - Visalaandhra
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » telangana sasci funds agriculture reforms
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:45 PM
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » telangana sir deadline extension to december 22
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:49 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
Eenadu
KTR: ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణకు ఎందుకు?: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరవుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
V6 Velugu
రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026, ఇన్వెస్ట్ తెలంగాణ సన్నాహకాలపై ప్రముఖ క్రీడాకారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
Namasthe Telangana
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై, సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పీవీ నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీలో ఎందుకు చేయలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Visalaandhra ·
తెలంగాణ సాగునీటి, తాగునీటి ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ… నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దాదాపు 90 టీఎంసీల కృష్ణా నది నీటిని మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరోక్ష సహకారం ఉంటోందని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రధానమంత్రి మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆయన విమర్శించారు. జల్ జీవన్ మిషన్ పేరుతో ఏపీ చేపడుతున్న…
Eenadu ·
హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరవుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో తొలిసారి అన్యాయం చేశారన్నారు. గతంలో తుమ్మిళ్ల లిఫ్ట్‌ను కేసీఆర్ ఏర్పాటు చేసి ఆర్డీఎస్ను కాపాడారని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
‘‘గతంలో నదీ జలాల విషయంలో అన్యాయం జరిగిందని కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఏర్పడింది. నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాం. కేసీఆర్ పాలనలో ఇతర జిల్లాల నుంచి అక్కడికి వలసలు వచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ఆపేందుకు కాంగ్రెస్ నేతలు కేసులు వేశారు. మేం అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. తెలంగాణకు ఉమ్మడి ఏపీ పాలకుల కంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కువగా నష్టం చేశారు. సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటుంటే నల్గొండ జిల్లా…
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Telangana Voter List 2026 Election Commission Gives Another Chance to Excluded Voters VK
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:26 PM
Visalaandhra ·
అసలేం జరిగింది?బోరబండ ప్రాంతానికి చెందిన బి. బాలరాజ్ అనే వ్యక్తి టాస్క్‌ఫోర్స్ పోలీసుల తీరును సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవి దేవి విచారణ చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పోలీసు యూనిఫాం ధరించకుండా సాధారణ పౌర దుస్తుల్లో వచ్చి ఇళ్లలో సోదాలు చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తనిఖీలు చేయడం, వస్తువులను స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
న్యాయవాది వాదనలు:పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ఏకపక్షంగా దర్యాప్తు చేపట్టడం ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) 2023’ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. బాధితులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా సెర్చ్ వారెంట్లు జారీ చేసే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు మాత్రమే ఉంటుందని, ఏసీపీ స్థాయి అధికారులు సెర్చ్ వారెంట్లు జారీ చేయడం చట్టబద్ధం కాదని న్యాయవాది స్పష్టం చేశారు.
V6 Velugu ·
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్ది అంతర్జాతీయ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026, ఇన్వెస్ట్ తెలంగాణ సన్నాహాకాలపై ప్రముఖ క్రీడాకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, ఎండీ సోనిబాలాదేవితో పాటు ప్రముఖ క్రీడా దిగ్గజాలు నిఖత్ జరీన్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా, అంబటి రాయుడు, ఈషా సింగ్, జె.జె. శోభ, ఇస్మాయిల్ బేగ్, అగసర నందిని, కల్నల్ నచ్ఛతర్ సింగ్ జోహల్, బోరియా మజుందార్, నీతా దాడ్వే పాల్గొన్నారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » Telangana Darshini Scheme Government Sanctions 11.69 Crore for Student Educational Tours
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:09 AM
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » KTR Questions Sonia Gandhi Autobiography Telangana Mention Bharat Summit 100 Crore
ABN , Publish Date - Nov 18 , 2026 | 06:06 AM
Namasthe Telangana ·
పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో ఎందుకు చేయలే? మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నరు.. నిజంగా వారికి అంత ప్రేమ ఉంటే పీవీ అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు చేయలేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలె. తెలంగాణ నాయకత్వం, ప్రజలపై సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నిజమైన అభిమానం లేదు. – కేటీఆర్
గాంధీలకు బాడీగార్డులా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం హోదాలో ఉండి గాంధీల కుటుంబానికి రేవంత్‌రెడ్డి అంగరక్షకుడిలా వ్యవహరిస్తున్నడు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడల్లా వారికి బాడీగార్డులా ఉంటున్నడు. తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్‌పై ఉన్నది. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చడం ఎంతవరకు సమంజసం? – కేటీఆర్
Namasthe Telangana ·
Local Body Elections | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మిలిగిన ఏడు కార్పొరేషన్లతోపాటు పరిషత్ ఎన్నికల ని ర్వహణకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న జాప్యం ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నది. పాలకవర్గాలు లేకపోవడంతో 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీ లు, 31 జిల్లా పరిషత్‌లు, 565 మండల పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,700 కోట్ల నిధులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నది. ఖ జానా ఖాళీగా ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి పను లు చేపట్టాలన్నా అప్పుల కోసం…
కాల పరిమితి తీరిన 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు ముగిశాయి. వీటికి ముందే డిసెంబర్లోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌లు, 565 మండల పరిషత్‌లు, 565 జడ్పీటీసీ, 5,673 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. రెండేండ్లుగా పాలకవర్గాలు లేక ఖాళీగా ఉన్నాయి. 5 కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మలాజిగిరి, వరంగల్, ఖమ్మం), 7 మున్సిపాలిటీలు (మణుగూరు, మందమర్రి, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల)కు కూడా ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా పాలకవర్గాలు కొలువుదీరక కేంద్రం నుంచి రా వాల్సిన నిధులు…
Namasthe Telangana ·
Per Capita Income | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలు పరిచింది. దీంతో తొలి పదేండ్లలో రాష్ట్రం తలసరి ఆదాయంలో గణనీయ పురోగతి సాధించింది. 2014-15 నాటికి సాధారణ క్యాటగిరీ రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఎనిమిదో స్థానంలో ఉన్న తెలంగాణ.. 2023-24 నాటికి రెండో స్థానానికి ఎగబాకింది. అప్పటికి తెలంగాణ కంటే గోవా రాష్ట్రం మాత్రమే ముందున్నది. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విస్తరణకు, ప్రజల తలసరి ఆదాయ పెరుగుదలకు దోహదపడ్డాయని తాజాగా సెంటర్ ఫర్…
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక ఆర్థికంగా తెలంగాణ గణనీయ వృద్ధిని నమోదు చేసిదని, 2014-25 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 219% పెరిగి రూ.5,05,484 కోట్ల నుంచి రూ.16,09,902 కోట్లకు చేరినట్టు ‘సెస్’ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో దేశ జీడీపీ 165%, ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 206% వృద్ధి చెందినట్టు పేర్కొన్నది. 2019-21 మధ్య కొవిడ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ కోలుకునే పరిస్థితి కనిపించినప్పటికీ కొవిడ్‌కు ముందు నమోదైన వృద్ధి స్థాయిలను అందుకోలేకపోయాయని నివేదిక విశ్లేషించింది.
Namasthe Telangana ·
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్‌ను పునరుద్ధరించాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన పోరాటం తీవ్రరూపం దా ల్చింది. ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ల క్షన్నర మంది ఉద్యోగులు సామూహిక సెలవు లు పెట్టి నిరసన బాటపట్టారు. దీంతో మంగళవారం సెలువు మంజూరు కోరుతూ సోమవారం రాత్రి వరకు సామూహిక సెలవుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది.
టీచర్లతోపాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ, అటవీశాఖ, పశుసంవర్ధక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, న్యాయశాఖల ఉద్యోగులు ఈ సామూహిక సెలవు పెట్టారు. సీపీఎస్ రద్దు.. పాత పింఛన్ పునరుద్ధరణకు తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ పి లుపు మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవుల ఉద్యమంలో భాగమయ్యారు.
Namasthe Telangana ·
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా తెలంగాణ నుంచి 78మంది ఎన్నికయ్యారు. ఐజే యూ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-హెచ్143) ఆ ధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాతీయ కౌన్సిల్, తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి, సీనియర్ పాత్రికేయుడు గోర్ల బుచ్చన్న అధికారికంగా వెల్లడించారు.
జాతీయ కౌన్సిల్‌కు ఎన్నికైనవారిలో హైదరాబాద్ నుంచి 33 మంది ఉన్నారు. వీరితోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఢిల్లీ నుంచి కూడా పలువురు సీనియర్ పాత్రికేయులు జాతీయ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. జాతీయ, రాష్ట్ర కౌన్సిల్‌కు ఎన్నికైనవారిలో ‘నమస్తే తెలంగాణ’ జర్నలిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారు. వివిధ జి ల్లాల నుంచి మొత్తం 19 మంది ‘నమస్తే తె లంగాణ’ జర్నలిస్టులు జాతీయ, రాష్ట్ర కౌన్సి ల్ స్థానాలకు ఎంపికయ్యారు.
Namasthe Telangana ·
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 16 : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆస్మిత ఖేలో ఇండియా ఉమెన్ సైకిలింగ్ (సౌత్ ఇండియా జోన్) క్రీడా పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహిళా క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. ఈమేరకు ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సైకిలింగ్ క్రీడకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందనీ, ఈ క్రీడలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు.
అంతేగాక పోటీల్లో పతకాలు సాధించిన మహిళలకు రైల్వే, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీస్ శాఖతోపాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైకిలింగ్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కాంతారావు, కోచ్ చంద్రారెడ్డి, మ్యాక్స్ వెల్ పెద్దపల్లి జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ తగరపు శంకర్, కరీంనగర్ జిల్లా…
Eenadu ·
మిరుదొడ్డి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఉద్యమ బాటపట్టారు. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) పిలుపు మేరకు నవంబరు 17న సామూహిక సాధారణ సెలవు పాటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీపీటీఎఫ్ నాయకులు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి జడ్పీహెచ్ఎస్, బీసీ కాలనీ పాఠశాలల ఉపాధ్యాయులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సామూహిక సెలవు పత్రాలు అందజేశారు. మిరుదొడ్డి అల్వాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సైతం సెలవు పెట్టారు. మరోవైపు సీపీఎస్ ఉద్యోగులందరూ జిల్లా కలెక్టరేట్ల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
V6 Velugu ·
హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి వార్తలతో అభిమానుల్లో ఆసక్తి రేపిన ఈ హీరో.. తాజాగా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో జరిగిన నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థ వేడుక..
Visalaandhra ·
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి అక్వాన్ తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం, నవంబర్ 15 సాయంత్రం 5:30 గంటల సమయానికి విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 920 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 16 సాయంత్రానికల్లా తుపానుగా, నవంబర్ 17 సాయంత్రం నాటికి తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత మరింత…
ఏపీ, ఒడిశా తీరాలకు ముందస్తు హెచ్చరికతుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో, ఏపీతో పాటు సమీపంలోని దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఐఎండీ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. తుపాను తీరం దాటే ప్రదేశం, దాని కచ్చితమైన తీవ్రతపై రాబోయే ఒకటి, రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత నమూనాల ప్రకారం, ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపే పయనించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Namasthe Telangana ·
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వారు వ్యవహరించిన తీరు రాష్ర్టానికి తీరని అవమానమని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు. టీ కాంగ్రెస్, బీజేపీ నేతల్లో ఉన్నత పదవులకు ఉండాల్సిన హుందాతనం కరువైందని దుయ్యబట్టారు. గాంధీలకు బాడీగార్డులా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించడం, రాహుల్‌గాంధీ బైక్ వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పనివాళ్ల మాదిరిగా పరుగులు తీయడం అవమానకరమని మండిపడ్డారు. అమిత్‌షా కాళ్లు మొక్కుతూ, ఆయన వెంట పరుగెడుతూ, చెప్పులు తీసుకెళ్లిన బీజేపీ…
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ యువత భవిష్యత్తుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. నిరుద్యోగ యువత కష్టానికి తగిన ఫలితం దకాలని, వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాల ఆశయాలను నెరవేర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం రూపొందించిన కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్‌ను కేటీఆర్ తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ మెటీరియల్ విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగార్థులకు కేవలం మాటలతో భరోసా ఇవ్వడమే కాకుండా, వారి లక్ష్యసాధనకు అవసరమైన…
V6 Velugu ·
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీకి ముప్పు పొంచి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ తుఫాను అక్వాన్ అని పేరు పెట్టింది ఐఎండీ. ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 20 నాటికి ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే ఉందని... దీని ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తూర్పు తెలంగాణ, దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 21, 22 తేదీల్లో ఇతర జిల్లాల్లో కూడా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ.
తుఫాను ప్రభావం ఏపీలోని కోస్తా తీరంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తుఫానుగా బలపడనున్న వాయుగుండం మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపింది.
V6 Velugu ·
ఖమ్మం టౌన్/దమ్మపేట వెలుగు : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల అమలు ఖర్చులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారుల సంఖ్య 45 లక్షలకు చేరిందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానుండగా, డిసెంబర్ 9న ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ఇందిరమ్మ మోడల్ కాలనీతో పాటు మున్నేరు కేబుల్ బ్రిడ్జి, మిర్చి మార్కెట్, మెడికల్ కళాశాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Andhra Jyothy ·
Home » Telangana » Hyderabad » bm sandeep appointed new telangana congress incharge replaces meenakshi natarajan
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:22 AM
Namasthe Telangana ·
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ‘అభయ హస్తం’లో పేరొన్న 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీ రాష్ట్ర ఖజానా ఖర్చుతో హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలపై కూడా సమాధానం చెప్పాలని శనివారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘అబద్ధాలు.. పచ్చి అబద్ధాలు.. వీటన్నింటికీ మించి కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అభయహస్తం’ అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వివిధ వర్గాలకు భారీ హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని విమర్శించారు.
Namasthe Telangana ·
హైదరాబాద్ : ఇటీవల ప్రచురితమైన సోనియా గాంధీ ( Sonia Gandhi ) ఆత్మకథ లో తెలంగాణ ( Telangana ) గురించి రాయకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Vinod Kumar) అన్నారు. దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం, ఎందరో బలిదానాలు, కేసీఆర్ అకుంఠిత దీక్షతో సాధించుకున్న తెలంగాణ గురించి ఆ పుస్తకంలో ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఆత్మకథ కాదు తెలంగాణ ప్రజల బలిదానాలు తీసుకున్న ప్రేతాత్మ కథ అని విమర్శించారు.
తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. నవంబర్ 29 యావత్ తెలంగాణ ఎప్పటికీ మర్చిపోలేని రోజని గుర్తు చేశారు. తెలంగాణ బానిస సంకెళ్లు తెంపిన రోజు ఇప్పటి తరానికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
V6 Velugu ·
గిగ్ వర్కర్ల పూర్తి సమాచారం ఇకపై మొబైల్ ఫోన్లోనే చూసుకోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమంపై హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లకు పెన్షన్, సామాజిక భద్రత కల్పిస్తామని, ప్రతి రైడ్, డెలివరీ లావాదేవీపై 1 శాతం నిధులు గిగ్ వర్కర్ల సంక్షేమానికి కేటాయిస్తామని.. కంపెనీలు చెల్లించే 1 శాతం నిధులు వర్కర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు.
గిగ్ వర్కర్ల బోర్డు ద్వారా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు పడతాయని, గిగ్ వర్కర్ల పూర్తి సమాచారం ఇకపై మొబైల్ ఫోన్లోనే చూసుకునే వెసులుబాటు తెలంగాణలోని గిగ్ వర్కర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రతి నగరంలో ప్రత్యేక రెస్ట్ జోన్లు ఏర్పాటు చేశామని, వై-ఫై సౌకర్యంతో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. రెస్ట్ జోన్లలో వాహనాల పార్కింగ్, నిద్రించేందుకు అవకాశం ఉందని చెప్పారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.