We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Deputy Chief Minister Pawan Kalyan became upset over a fake resignation news report spread on a WhatsApp channel and decided to file a complaint with cybercrime.
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న ‘రోమియో జూలియట్’ నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. భార్గవ్ మాచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈటీవీ విన్ సమర్పణలో, నవరస ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సందీప్.ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. ఓ ప్రత్యేకమైన పోస్టర్‌తో ఈ సినిమా విడుదల తేదీని ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. ‘‘ప్రేమ విషయంలో నేటి యువతరానికి ఎదురవుతున్న అనుభవాలకు, వాళ్ల ఆలోచనలకు అద్దం పట్టే కథ, కథనాలతో రూపొందిన చిత్రమిది. అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. చిత్రం కూడా అదే తరహాలో మెప్పిస్తుంద’’ని…
ఒడియాలో విజయవంతమైన ‘జడి’ సినిమా అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. శైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా, సుశాంత్దాస్ మహాపాత్ర ప్రధాన పాత్రధారులుగా... దివ్యజ్యోతి ఉదయసింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. కాజల్ రే నిర్మించారు. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అశ్వినికుమార్ గౌడ్ విడుదల చేస్తున్నారు. ఇటీవల ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. కళాశాల యువకుల మధ్య స్నేహం, అనుబంధాలు, అభిప్రాయ భేదాలు, సంఘర్షణ లతోపాటు ప్రేమకథకూ పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు స్పష్టమవుతోంది.
teja sajja clarity - marriage rumours: పెళ్లి వార్తలపై తేజ సజ్జా క్లారిటీ
Analysis pending
ఇంటర్నెట్ డెస్క్: యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో తాను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. నవంబరులో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరుగుతుందన్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తామన్నారు. తమది పెద్దలు కుదిర్చిన సంబంధమని, వధువు కుటుంబానికి సినీ పరిశ్రమతో సంబంధాలు లేవని తేజ చెప్పారు. వారి కుటుంబం టెక్నాలజీ వ్యాపారంలో ఉన్నట్లు తెలిపారు.
Social media rumors claiming Deputy CM Pawan Kalyan is resigning have been circulating, prompting the government to prepare for the arrest of the rumor-spreading group.
Actor Dhanush is widely expected to enter politics in Tamil Nadu following recent activities and rumors about him registering a new party. The ruling party TVK welcomed his potential entry, praising his long-term commitment to politics exemplified by Vijay's career.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛానల్ పెడుతున్నారని.. తన పదవికి రాజీనామా చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. త్వరలోనే బిగ్ ట్విస్ట్ రానుందంటూ వార్తలు సర్కులేట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు జనసేన నేతలు, డిప్యూటీ సీఎం కార్యాలయం. ఈ ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.వైసీపీ నేతలే వెనుకుండి ఈ విష ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు.
ముథోల్, న్యూస్‌టుడే: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల (పీయూసీ 1 నుంచి ఇంజినీరింగ్ 4 వరకు) దసరా సెలవులను పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అకడమిక్ విభాగ బాధ్యులు బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వవిద్యాలయంలో విద్యా, వికాస కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా దసరా సెలవుల తర్వాత తరగతుల ప్రారంభాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నాం. పునఃప్రారంభ తేదీలను త్వరలో తెలియజేస్తాం. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలి’’ అని వారు కోరారు.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన వేళ మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) పాక్ ఉగ్రవాద వైఖరిని మరో సారి ప్రపంచం ముందుంచారు. 2008లో ముంబయిలో జరిగిన మారణహోమానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సునీల్ కుడ్యాదీని రూబియో ముందుకు తీసుకువచ్చారు. నాటి ఉగ్రఘటనను సునీల్ (Sunil Kudyadi) కళ్లకు కట్టినట్లు వివరించి.. పాక్ కుటిలనీతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అనంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశానికి తాము వ్యతిరేకమని రూబియో పేర్కొన్నారు. ఇదంతా జైశంకర్-రూబియో భేటీ సందర్భంగా జరిగింది. దీంతో సునీల్ కుడ్యాదీ పేరు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ముంబయిలో మార్కో రూబియో (Marco Rubio) 26/11 ఉగ్రదాడి స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అప్పట్లో తాజ్ హోటల్ సెక్యూరిటీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుడ్యాదీ నాటి భయానక పరిస్థితులను వివరించారు. లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు దాదాపు 60 గంటల పాటు హోటల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో వెల్లడించారు.
Dhanush Party : నటుడు ధనుష్ (Actor Dhanush) రాజకీయరంగ ప్రవేశంపై తమిళనాడు (Tamil Nadu) లో గత కొంతకాలంగా చర్చ నడుస్తున్నది. ఆయన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం (Dhanush Narpani Iyakkam)’ గా మార్చడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమని అంతా అంటున్నారు. ఈ పరిణామంపై తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని తెలిపింది.
టీవీకే అధికార ప్రతినిధి ఎం సత్యకుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ.. తమ పార్టీ ప్రయాణం ఇతరులు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు. హీరోగా ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే విజయ్ సినిమాలను వదిలి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని గుర్తుచేశారు. విజయ్ ఇందుకోసం 30 ఏళ్లపాటు కృషి చేశారని, ఇది అంత సులభమైన ప్రయాణం కాదని సత్యకుమార్ అన్నారు. రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే.. దానిని నిలబెట్టడం, ఎన్నికల్లో విజయం సాధించడం మరో ఎత్తు అని చెప్పారు.
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఆయన బ్రెయిన్ హెమరేజ్‌తో కోమాలోకి వెళ్లారని.. చికిత్స తీసుకుంటూ మరణించారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. కిమ్ చనిపోవడంతో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాను ఆధీనంలోకి తీసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో వీటికి ఉత్తర కొరియా చెక్ పెట్టింది. ఓ ప్రదర్శనలో కిమ్ పాల్గొన్న ఫొటోలను ప్రభుత్వ మీడియా బయటపెట్టింది.
ఉత్తర కొరియా ప్రభుత్వ పత్రిక రోడాంగ్ సిన్మున్ ప్రచురించిన ఫొటోల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ వస్త్రాలు, పాదరక్షల ప్రదర్శనను సందర్శించారు. అక్కడ మహిళా ఉద్యోగి చేతిలో ఉన్న చిన్న గులాబీ రంగు షూను పరిశీలిస్తున్నట్లు ఓ ఫొటోలో కనిపించారు. మరో చిత్రంలో అధికారులతో మాట్లాడుతూ చేతులను చాపి ఉన్నారు. ఇంకో ఫొటోలో బొమ్మపై ప్రదర్శనకు ఉంచిన మహిళల కోటు స్లీవ్‌ను తాకుతూ కనిపించారు. అయితే ఫొటోలు ఎప్పుడు తీసినవో స్పష్టత లేదు.
Free Data Engineering Course | హనుమకొండ, అక్టోబర్ 18:తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం పూర్తిగా ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తోంది. డేటా ఇంజినీరింగ్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పట్టభద్రులకు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
2022 నుంచి 2026 మధ్య ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఈ శిక్షణకు అర్హులు. తరగతులు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. మూడు దశాబ్దాల బోధనా అనుభవం ఉన్న అధ్యాపకులు అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.