Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
178 సంస్థలపై సైబర్ దాడి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జూమ్, బీబీసీ, సీఎన్ఎన్ వంటి సంస్థలకు చెందిన వెబ్సైట్లలో హ్యాకర్లు హానికర కోడ్‌ను చొప్పించినట్లు సైబర్ భద్రత దర్యాప్తులో తేలింది.
ఈనెల 16న ఈ వెబ్సైట్లను సందర్శించిన వినియోగదారుల ఆర్థిక, వ్యక్తిగత సమాచారం ముప్పులో పడే అవకాశం ఉన్నదని దర్యాప్తు పేర్కొన్నది.
ప్రపంచ వ్యాప్తంగా 178 సంస్థల వెబ్సైట్లలోకి హ్యాకర్లు రహస్యంగా హానికర స్క్రిప్ట్‌లను చేర్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: జూమ్, బీబీసీ, సీఎన్ఎన్, హెచ్ఎస్బీసీ, ఐకియా వంటి సంస్థలకు చెందిన వెబ్సైట్లలో హ్యాకర్లు హానికర కోడ్‌ను చొప్పించినట్టు సైబర్ భద్రత దర్యాప్తులో తేలింది. ఈనెల 16న ఈ వెబ్సైట్లను సందర్శించిన వినియోగదారుల ఆర్థిక, వ్యక్తిగత సమాచారం ముప్పులో పడే అవకాశం ఉన్నదని దర్యాప్తు పేర్కొన్నది. ప్రపంచ వ్యాప్తంగా 178 సంస్థల వెబ్సైట్లలోకి హ్యాకర్లు రహస్యంగా హానికర స్కిప్ట్ల్రను చేర్చినట్టు దర్యాప్తులో గుర్తించారు. వెబ్సైట్లకు వేర్వేరు నమూనాలను పరీక్షించడానికి, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీలు ఉపయోగించే ఆప్టిమైజ్లీ ప్లాట్‌ఫామ్‌లోని లోపాన్ని దాడికి వాడుకున్నట్టు తెలిసింది.
ప్రధాన వెబ్సైట్లో మార్పులు చేయకుండానే కోడ్‌ను చేర్చడానికి ఈ ప్లాట్‌ఫామ్ సంస్థలకు అవకాశం ఇస్తున్నది. సైబర్ భద్రత సంస్థ రిపోర్ట్ యూఆర్ఐ ప్రకారం, ఆప్టిమైజ్లీ ఖాతా నమోదు ప్రక్రియలోని బలహీనతను హ్యాకర్లు వినియోగించుకున్నారు. కస్టమర్ల ప్రాజెక్టుల్లోకి హానికర జావాస్కిప్ట్న్రు చొప్పించారు. సేల్స్‌ఫోర్స్, ఫాక్స్ న్యూస్ వెబ్సైట్లు కూడా ప్రభావితమైనట్టు వెల్లడైంది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)