Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అందెశ్రీ రచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి : మంత్రి జూపల్లి కృష్ణారావు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Minister Jupally Krishna Rao paid tribute to the late poet Ande Sri at his memorial event in Hyderabad, stating that Ande Sri's work and services will remain in history and that his absence is an irreparable loss to the Telangana literary field.
The minister praised the poet for instilling the spirit of the Telangana movement through his songs and writings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: అందేశ్రీ రచనలు, సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, ఆయన మన మధ్య లేకపోవడం తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన అందేశ్రీ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలు, రచనల ద్వారా యావత్ తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప ప్రజాకవి అందేశ్రీ అని కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గేయం కోట్లాది మంది ప్రజల గొంతుకగా మారిందని గుర్తు చేశారు. కవులు, సాహితీవేత్తలు ఎన్ని పుస్తకాలు రాశారన్నది ముఖ్యం కాదని, వారి రచనలు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయనేదే కీలకమని.. ఆ కోణంలో చూస్తే అందేశ్రీ అత్యున్నత ప్రజాకవిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, చరణ్ కౌశిక్ యాదవ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)