Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
B Vinod Kumar | దీక్షా దివస్ ఘనంగా నిర్వహిస్తాం.. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు అలుగునూర్‌లో ఆదివారం జరగనున్న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం కంటే కేసీఆర్ చేసిన దీక్ష గొప్పదని, దీక్ష దివస్ లేకుంటే తెలంగాణ లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలో ఎన్నడూ పంటల ఎండయా అని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
B Vinod Kumar | తిమ్మాపూర్, నవంబర్ 28 : అలుగునూర్‌లో ఆదివారం జరగనున్న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్,మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఈ మేరకు వారు శనివారం దీక్షా దివస్ నిర్వహించే ప్రాంగణం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం ఎంత గొప్పదో కేసీఆర్ చేసిన దీక్ష అంత గొప్పదని భావించుకోవాలని, దీక్ష దివస్ లేకుంటే తెలంగాణ లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నిదానంతో పోరాటం సాగిందని గుర్తు చేశారు. దీక్షతోనే మళ్లీ ఉద్యమానికి నాంది పలికిందని అన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్న 10 ఏళ్లలో ఎన్నడైనా పంటల ఎండయా అని ప్రశ్నించారు. ఇది కాలంతో వచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తెచ్చిన తరువాత విమర్శించారు. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి తుపాకి పట్టుకొని కరీంనగర్ వచ్చాడని, నాటి పోరాటాలు యువతరానికి తెలియాలని కానీ వినీ ఎరుగని రీతిలో సభను నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)