Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
B Vinod Kumar | దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ శంకరపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజకీయ పోరాటాలు, కేంద్ర ప్రభుత్వ హామీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలు కీలక పాత్ర పోషించాయని అన్నారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరినప్పుడు పోలీసులు అరెస్టు చేసిన ఘటనను గుర్తుచేస్తూ, ఈ నెల 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
B Vinod Kumar | శంకరపట్నం, నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో రాజకీయ పోరాటాలు, కేంద్ర ప్రభుత్వ హామీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలు కీలక పాత్ర పోషించాయని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 29న అలుగునూరు చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శంకరపట్నంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లామని తెలిపారు. పలుమార్లు కేసీఆర్ తెలంగాణ…
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్ను అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని వినోద్ కుమార్ తెలిపారు. కావున నాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసేందుకు నిర్వహించే దీక్షా దివస్ సభ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)