Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
భారత్ ఆర్థిక సంక్షోభం దిశగా పయనం.. నిరుద్యోగంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడుతూ భారత్ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘంపై ఓటు చోరీ ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పించగా, బీజేపీ ప్రతినిధులు రాహుల్ వ్యాఖ్యలను తప్పుబడుతూ భారత్ అభివృద్ధిని సమర్థించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారత్ ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, విద్యా వ్యవస్థలోనూ అనేక లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.సోమవారం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.నిజం చెప్పాలంటే భారత్ అంచున ఉంది. ఇదే వాస్తవం. దీన్ని ఎవరైనా పక్కన పెట్టవచ్చు. మీడియా కూడా పట్టించుకోకపోవచ్చు.కానీ దేశంలో భారీ నిరుద్యోగ సమస్య ఉంది. విద్యా వ్యవస్థ కూడా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
యువత, తల్లిదండ్రుల మధ్య కెరీర్ విషయంలో అంతరంయువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య కెరీర్ అవకాశాల విషయంలో అంతరం పెరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు.ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన, చదువుకున్న యువత తమ ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.తమకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయనే నమ్మకం వారిలో కనిపించడం లేదని వివరించారు. మేము ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నాం.దీనికి గల కారణాలను పరిశీలించాం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యువత తమ భవిష్యత్తును స్పష్టంగా చూడలేకపోతున్నారు.తమకంటూ ఓ భవిష్యత్తు ఉందనే భావన వారిలో లేదని రాహుల్ వ్యాఖ్యానించారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)