Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
CJP Saurav Das: పుట్టిన ప్రదేశంపై స్పష్టత ఇవ్వండి.. సౌరవ్దాస్కు కేంద్రం నోటీసులు
By Eenadu1 min read at Eenadu
In brief
కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ పాస్‌పోర్టులో పుట్టిన ప్రదేశ వివరాలపై వ్యత్యాసాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ మాట్లాడుతూ, భద్రతా సంస్థల నివేదికల ఆధారంగా చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని చెప్పారు.
సౌరవ్ దాస్ సమాధానం వచ్చే వరకు పాస్‌పోర్టు ఉపయోగించవద్దని అందులో పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఇంటర్నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌కు సంబంధించి తన పాస్‌పోర్టులో పేర్కొన్న పుట్టిన ప్రదేశం వివరాలపై వ్యత్యాసాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంపై భద్రతా సంస్థల నుంచి నివేదికలు అందాయని.. ఈ నేపథ్యంలోనే ఆయనకు చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దీనిపై సౌరవ్ నుంచి సమాధానం వచ్చే వరకు పాస్‌పోర్టు ఉపయోగించవద్దని అందులో పేర్కొంది.
యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సౌరవ్ దాస్ ఇటీవల బయలుదేరి వెళ్తుండగా.. దిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ స్పందిస్తూ.. సౌరవ్ పాస్‌పోర్టులో పేర్కొన్న వివరాల్లో వ్యత్యాసాలున్నట్లు అధికారులు గుర్తించారని, ఈ క్రమంలోనే నవంబర్ 23న ఆయనకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. సాధారణంగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు కచ్చితమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని, ఎవరైనా వాస్తవాలను దాచిపెట్టినట్లు గుర్తిస్తే వారికి నోటీసు జారీ చేస్తారని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)