Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Crop loans: కౌలు రైతుల అప్పులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కు
By Eenadu2 min read at Eenadu
In brief
బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
భూ భారతి పోర్టల్లో కౌలు రైతులకు తగిన వెసులుబాటు లేకపోవడంతో వారు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారని బ్యాంకర్లు తెలియజేశారు.
కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి గ్రామస్థాయి అధికారులు సంఘాలను ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని బ్యాంకుల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భూ భారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలతో బ్యాంకుల నుంచి అందని పంట రుణాలు పరిష్కరించాలని ప్రభుత్వానికి బ్యాంకర్ల వినతి
ఈనాడు, హైదరాబాద్: కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేయమని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు పరిష్కారం కానందున ఆ లక్ష్యం నెరవేరడం లేదు. కౌలు రైతులకు పంట రుణాల పంపిణీకి భూ భారతి పోర్టల్లో సాంకేతిక సమస్యలు అవరోధంగా మారాయి. వారు సాగుచేస్తున్న పొలం విస్తీర్ణాన్ని గుర్తించడానికి అధికారిక వ్యవస్థ కరవైందని ఈ సమస్యను పరిష్కరించాలని బ్యాంకర్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకులు కౌలు రైతులకు ఏడు శాతం వడ్డీతో పంట రుణాలను అందజేస్తాయి. అవి అందనందున వారు ప్రైవేటు వ్యాపారుల వద్ద 24-60 శాతం వరకూ వడ్డీకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)