Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dharmaram | రైతులు గిట్టుబాటు ధరకు సన్న వడ్లను విక్రయించాలి.. ధర్మారం ఇన్చార్జి ఏవో ప్రకాష్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Dharmaram Mandal In-charge Assistant Agricultural Officer K. Prakash urged farmers to sell their Sannavari (fine rice) at the minimum support price.
He advised farmers to avoid middlemen to secure better prices, specifically citing the rate of Rs. 2,961 per quintal.
The official also instructed farmers to report any losses caused by middlemen to the local cluster Assistant Agricultural Officers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Dharmaram | ధర్మారం, అక్టోబర్ 22 : రైతులు వానాకాలంలో పండించిన సన్న వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే విక్రయించుకోవాలని మండల ఇన్చార్జి ఏవో కే ప్రకాష్ కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మారం మండలంలోని దొంగతుర్తి, రామయ్యపల్లి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను గురువారం ఆయన సందర్శించారు. సన్న వరి పొలాలను సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కే ప్రకాష్ మాట్లాడుతూ రైతులు తమ వరి సన్న వడ్ల అమ్మకం విషయంలో అప్రమత్తంగా ఉండి ఉండి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్ కి రూ.2,461 బోనస్ రూ. 500 తో కలిపి 2961విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని అన్నారు.
రైతులు దళారుల మాటలు నమ్మి తక్కువ ధరలకు పంట ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని, మార్కెట్లో పంటలకు లభిస్తున్న ధరలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. అలాగే పంట ఉత్పత్తుల విక్రయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దళారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు రైతులకు ఆయన సూచించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సరైన ధరకు విక్రయించుకుని ఆర్థికంగా లాభపడాలని, వ్యవసాయ శాఖ అందించే సూచనలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మధ్య దళారులు ధాన్యం కొనుగోళ్లలో నష్టం చేస్తే క్లస్టర్ పరిధిలో ఉన్న ఏఈఓలకు సమాచారం అందించాలని ఇన్చార్జి ఏవో ప్రకాష్ కోరారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)