Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ఎస్బిఐ డేటా లీకేజీపై దర్యాప్తు.. 3,897 రికార్డుల్లో వ్యక్తిగత సమాచారం
By Prajasakti||1 min read at Prajasakti
In brief
[PUBLISHER] reported that SBI disclosed a data leak after approximately 3.75 lakh records were found on the dark web.
The bank stated that 3,897 records contained personally identifiable information, but clarified that account balances and funds remain completely secure.
SBI also noted that it notified affected customers via email and WhatsApp, and is conducting a comprehensive investigation with the help of a CERT-In recognized cybersecurity firm.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ : డార్క్ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డుల ప్రాథమిక పరిశీలనలో వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం ఉన్న 3,897 మంది ఖాతాదారుల రికార్డులను గుర్తించినట్లు ఎస్బిఐ వెల్లడించింది. అయితే, ఖాతాదారుల ఖాతాల్లోని నిల్వలు, నిధులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ఘటనపై అక్టోబర్ 21న ప్రకటన విడుదల చేసిన బ్యాంకు, ప్రభావిత ఖాతాదారులకు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించినట్లు శుక్రవారం తెలిపింది. ఖాతాదారులు సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను పాటించాలని, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ షేర్ చేయవద్దని సూచించింది. అనుమానాస్పద ఫోన్ కాల్స్…
డార్క్ వెబ్‌లో బయటపడినట్లు అనుమానిస్తున్న సమాచారంలో ఖాతాదారుల పేర్లు, పుట్టిన తేదీలు, లింగం, నమోదిత ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, నివాస చిరునామాలు ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది. వీటితోపాటు బ్యాంకు శాఖల వివరాలు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (సీఐఎఫ్) నంబర్లు, లీడ్ ఐడీలు, రుణాలు, లీడ్ రికార్డులకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు సమాచారం.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)