Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Gangula Kamalakar | తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి : గంగుల కమలాకర్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని మంకమ్మతోటలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రజలను ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మక మలుపు అని ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని, ఆ దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటలో విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగుల కమలాకర్‌తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలకు బొట్టుపెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానించారు.
మంకమ్మతోటలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల, ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వారి పేర్లతో ఆత్మీయంగా పలకరిస్తూ దీక్షా దివస్ సభకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, ఉద్యమంలో , కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా రాష్ట్ర ఏర్పాటు దిశగా జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించారు. నాయకులు స్వయంగా ఇంటింటికీ వచ్చి బొట్టుపెట్టి, ఆత్మీయంగా పలకరిస్తూ ఆహ్వానించడంతో స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలువురు ప్రజలు నాయకులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ దీక్షా దివస్ సభకు తప్పకుండా హాజరవుతామని, సభను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)