Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
JEE Main | రేపటితో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపిన ప్రకారం, JEE Main దరఖాస్తుల గడువు రేపటితో ముగియనుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.29 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 11.19 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించారు.
అభ్యర్థులు తమ దరఖాస్తును అసంపూర్ణంగా వదిలేయవద్దని, అప్లికేషన్ సమర్పించి, ఫీజు చెల్లించి, అదేరోజు కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలని ఏజెన్సీ సూచించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
JEE Main : జేఈఈ మెయిన్ (JEE Main) ధరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్నదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడవద్దని సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.29 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 11.19 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించి తమ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించారని వెల్లడించింది. అభ్యర్థులు ఎవరూ తమ దరఖాస్తును అసంపూర్తిగా వదిలేయవద్దని, అప్లికేషన్ సమర్పించి, ఫీజు చెల్లించి, అదేరోజు కన్ఫర్మేషన్ పేజీని కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
కాగా జేఈఈ మెయిన్‌కు ఈ నెల 22న అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. రూ.500 లేట్ ఫీజుతో నవంబర్ 26 వరకు అవకాశం ఉంది. తొలి విడత జేఈఈ పరీక్షలను జనవరి 20 నుంచి 24 వరకు, మళ్లీ 28న నిర్వహిస్తారు. ఈ ఆన్లైన్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ 011-40759000 / 1800-180-4747, ఈ-మెయిల్ jeemain@nta.ac.in లో సంప్రదించాలని ఎన్టీఏ సూచనచేసింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)