Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Kalyan Krishnamurthy: ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
By Eenadu1 min read at Eenadu
In brief
Flipkart గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి 11 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరం తన పదవికి రాజీనామా చేశారు.
ఈ విషయాన్ని కంపెనీ బుధవారం అధికారికంగా ప్రకటించింది, అయితే ఆయన నిష్క్రమణకు గల కారణాలను గానీ, తదుపరి ఎవరు బాధ్యతలు చేపడతారనే వివరాలను గానీ వెల్లడించలేదు.
ప్రత్యర్థి సంస్థలైన అమెజాన్, మీషో నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కంపెనీని స్థిరంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ (Flipkart) నాయకత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 11 ఏళ్లకు పైగా సేవలందించిన గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన నిష్క్రమణకు గల కారణాల వివరాలను గానీ, తదుపరి ఎవరు బాధ్యతలు చేపడతారనే వివరాలేవీ వెల్లడించలేదు.
ఫ్లిప్‌కార్ట్‌ను సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ స్థాపించారు. వారు తప్పుకొన్నాక 2017లో కల్యాణ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2018లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌నకు సీఈఓ అయ్యారు. ప్రత్యర్థి సంస్థలైన అమెజాన్, మీషో నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కంపెనీని స్థిరంగా నిలబెట్టడంతో కీలక పాత్ర పోషించారు. జెన్‌జీ కస్టమర్లను ఆకర్షించడంతో పాటు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టడం, బ్లింకిట్, జెప్టోలకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ను తీసుకురావడంపై దృష్టి సారించారు. దాదాపు 11 ఏళ్లుగా కృష్ణమూర్తి ఫ్లిప్‌కార్ట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)