Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కోయిల్‌సాగర్‌కు మరణ శాసనం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
పాలమూరు జిల్లాలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల అవసరాలకు నీరు అందడం లేదని, అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోసం సుమారు రూ.490 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్‌కు అనుమతులు మంజూరు చేశారని ఈ నివేదిక పేర్కొంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నీటిని ఎత్తిపోయడం ద్వారా ఆయకట్టును 50 వేల ఎకరాలకు పెంచిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నీటిని తరలించలేదని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహబూబ్‌నగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు జిల్లాలో మరో తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కోసం రెండు జిల్లాల్లో నీళ్ల చిచ్చుపెట్టారు. కొడంగల్ నియోజకవర్గానికి తాగునీటి అవసరాల కోసం ఏకంగా రూ.490 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్ కోసం పరిపాలన అనుమతులు మంజూరు కావడం పాలమూరు జిల్లా లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫైల్ కదలడం.. అనుమతులు రావడంతో కంగుతిన్నారు. ఇదే కనుక జరిగితే కోయిల్ సాగర్ ఆయకట్టు తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది.
ఇప్పటికే నీళ్లు లేక వందలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోయాయి. ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ చేస్తున్నారు. కృష్ణా నదికి భారీ వరద వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కోయిల్ సాగర్‌కు నీటిని ఎత్తిపోయకపోవడంతో వర్షాధారంతో వచ్చిన నీళ్లే దిక్కయ్యాయి. ఈ ప్రాజెక్టు వాస్తవ ఆయకట్టు 12 వేల ఎకరాలు కాగా.. జూరాల బ్యాక్‌వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసి ఆకట్టును 50 వేలకు పెంచారు. ఎప్పుడు కూడా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక నిరంతరాయంగా కృష్ణా నీటిని ఎత్తిపోయడంతోపాటు ఊక చెట్టి వాగు కృష్ణా నదిలో కలిసే వరకు సుమారు 17 చెక్‌డ్యామ్‌లను నిర్మించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)