Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Land Dispute | కూతురి పెళ్లి కోసం రూ.25 వేల అప్పు.. 4.5 ఎకరాల భూమి కోల్పోయిన మహిళకు 30 ఏళ్ల తర్వాత న్యాయం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన ముండుబాయి ఇరప్ప దావ్రే అనే మహిళ దాదాపు 30 ఏళ్ల క్రితం తన కుమార్తె వివాహ ఖర్చుల కోసం రూ.25 వేలు అప్పు తీసుకుని 4.5 ఎకరాల భూమిని తాకట్టు పెట్టింది.
నకిలీ సాక్షులను ఉపయోగించి వడ్డీ వ్యాపారి ఆ భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు, ఆ తర్వాత కలెక్టర్ భరత్ బస్తవాడ్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రికార్డులను సరిచేసి ఆమెకే భూమిని తిరిగి దక్కజేశారు.
గురువారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమెకు 7/12 పత్రాలను అందజేశారు, ఆమె కలెక్టర్ మరియు స్థానిక అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Land Dispute | కూతురి పెళ్లి కోసం తీసుకున్న అప్పు ఓ మహిళకు మూడు దశాబ్దాల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది. కేవలం రూ.25 వేల కోసం తాకట్టు పెట్టిన 4.5 ఎకరాల భూమి చివరకు చేజారిపోయింది. అప్పు తీర్చేందుకు రూ.2.5 లక్షలు ఇస్తానన్నా కనికరించలేదు. అసలు, వడ్డీ కలిపి రూ.10 లక్షలు కట్టాల్సిందేనని పట్టుబట్టాడు. అంత మొత్తం చెల్లించలేక ఆ మహిళ ఏళ్ల తరబడి తన భూమికి దూరమైంది. అయితే మూడు దశాబ్దాల తర్వాత ఆమెకు ఊహించని ఊరట లభించింది. అధికారుల చొరవతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తన 4.5 ఎకరాల భూమిని తిరిగి దక్కించుకుంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లాతూర్ జిల్లా చాకూర్ తాలూకా కల్కుటి గ్రామానికి చెందిన ముండుబాయి ఇరప్ప దావ్రే.. దాదాపు 30 ఏళ్ల క్రితం తన కుమార్తె వివాహ ఖర్చుల కోసం ఓ ప్రైవేటు వడ్డీ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకుంది. ఇందుకోసం తనకున్న 4.5 ఎకరాల భూమిని తాకట్టు పెట్టింది. తొలుత పంటలో వాటా ఇస్తానని చెప్పిన వడ్డీ వ్యాపారి.. ఆ తర్వాత భూమిపై ఆధిపత్యం చెలాయించాడు. నకిలీ సాక్షులను ఉపయోగించి భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)