Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The BRS legal cell issued defamation notices to Telangana PCC president Mahesh Kumar Goud, Minister Ponguleti Srinivasa Reddy, and MP Gaddam Vamsi Krishna for alleged false campaigns regarding the diversion of Kondapochamma Sagar water to KCR's farmhouse.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులు పంపించారు. ఇదే అంశంపై ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ నేతలకు కూడా నోటీసులు పంపించారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసింది.