Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mulkanoor | దీక్షా దివస్ కు రావాలని ముల్కనూరులో ఇంటింటా బొట్టు పెట్టి ఆహ్వానం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఆమె ముల్కనూర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు నుదుట బొట్టు పెట్టి ఆత్మీయంగా ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరియు వార్డు సభ్యులు పాల్గొని, గ్రామ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Mulkanoor | చిగురుమామిడి, నవంబర్ 27 : ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో తరలిరావాలని ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య పిలుపునిచ్చారు. ముల్కనూర్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు నుదుట బొట్టు పెట్టి, ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. దీక్షా దివస్ ప్రాధాన్యతను వివరిస్తూ, తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలు, దీక్ష యొక్క చారిత్రక నేపథ్యాన్ని మహిళలకు గుర్తు చేశారు. ప్రతీ మహిళ తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
గ్రామంలోని మహిళలు సర్పంచ్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించి, తప్పకుండా హాజరవుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాంబారి కొమురయ్య, వార్డు సభ్యులు వంగల రాం, జట్టి లత, విజయలక్ష్మి, గట్టు రేణుక తదితరులు పాల్గొన్నారు. అలుగునూరులో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, మహిళల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం మరింత విజయవంతం అవుతుందని నాయకులు తెలిపారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)