Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ పార్లమెంట్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఎంపీలకు రూ.150 కోట్ల ఆఫర్ ఇస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైకి తరచుగా రావడాన్ని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షాల సంఖ్యా బలాన్ని తగ్గించేందుకు అధికార పార్టీ తన అధికారాన్ని వినియోగిస్తున్నదని రౌత్ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై: పార్లమెంట్లో ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్)కు మద్దతు కూడగట్టేందుకు ఎంపీలతో బీజేపీ శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఛత్రపతి సంభాజీనగర్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన రౌత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ ముంబైకి రావడాన్ని ప్రశ్నించారు. డబ్బు తరలింపునకు ముంబై మార్గంగా మారిందని ఆయన అన్నారు.
‘కేంద్ర హోంమంత్రికి ముంబైలో అసలు పని ఏమున్నది? ఎంపీలను ఆకర్షించే బాధ్యతను మహారాష్ట్ర, ముంబైలోని కొందరు కీలక నేతలకు అప్పగించారా?’ అని రౌత్ ప్రశ్నించారు. కొద్ది రోజుల కిందట ఒక ఎంపీ ధర రూ.100 కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ.150 కోట్లకు చేరిందని రౌత్ ఆరోపించారు. ప్రతిపక్షాల సంఖ్యా బలాన్ని తగ్గించేందుకు అధికార పార్టీ తన అధికారాన్ని వినియోగిస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీల ప్రకటనలో జాప్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని రౌత్ ప్రశ్నించారు. సమావేశాల నిర్వహణకు ఇంత ఆలస్యం ఎందుకవుతున్నదని అడిగారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)