Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఊరు పొమ్మంది.. ఉపాధి రమ్మంది!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో కరువు, నీటి ఎద్దడి కారణంగా రైతులు, గిరిజనులు ఉపాధి కోసం ఆరు నెలలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఈ నివేదిక వివరిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వలసలు తగ్గాయని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయని రైతులు ఆరోపిస్తున్నారు.
కైలాశ్ రాథోడ్, మారొనిబాయి వంటి స్థానిక రైతులు తమ పేదరికపు పరిస్థితులను, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడాన్ని వివరిస్తూ ఉదహరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నారాయణఖేడ్, నవంబర్ 16: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల పుణ్యమా అని వెనుకబాటు ముద్ర పడింది సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం. సాగునీటి వనరులు లేక, ఉపాధి అవకాశాలు లేక, వ్యవసాయం అనుకూలించక కేవలం వర్షాధార పంటలను నమ్ముకుని బతుకీడ్చాల్సిన దుస్థితి ఇక్కడి రైతులది. చాలీచాలని భూము లు కలిగిన రైతులు, కూలీలు పనులు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తగా.. ఏటా కర్మాగారాల్లో పనులు చేసేందుకు ఆరు నెలలపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించుకునే దైన్యం ఇక్కడి రైతులు, ప్రజలది. చెరుకు క్రషింగ్ ప్రారంభమైందంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో వలస గంట మోగినట్టే.…
దీపావళి తరువాతే వలసలు.. ఏటా దీపావళి పండుగ తరువాత వలస వెళ్లే వారు తిరిగి మార్చిలో స్వగ్రామాలకు చేరుకుంటారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయ రంగానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న వలసలను గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో క్రమంగా తగ్గుముఖం పట్టిన వలసలు గత మూడేండ్లుగా మళ్లీ పెరుగడం గమనార్హం. ఓ వైపు రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోగా ఈ సారి నెలకొన్న కరువు పరిస్థితులు వలస బండిని తోలక తప్పని దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నియోజకవర్గం నుంచి 70 శాతం మంది…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)